Movie News

టాలీవుడ్ నేర్పించిన మాస్ పాఠాలు

గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. అలా ఉంది కొందరు నెటిజెన్ల అత్యుత్సాహం. గత ఏడాది కాలంలో తమిళ దర్శకులు మూడు మాస్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అవి విక్రమ్, జైలర్, జవాన్. ఇది సత్యం. అలా అని ఇంకే భాషలోనూ వేరెవరూ ఇలా హ్యాండిల్ చేయలేరనే రీతిలో జబ్బలు చరుచుకోవడం మాత్రం కామెడీనే. ఎందుకంటే మాస్ బాక్సాఫీస్ కి కొత్త గ్రామర్ తీసుకొచ్చిందే టాలీవుడ్. గుండమ్మ కథలో ఎన్టీఆర్ పాత్రతో మొదలుపెడితే అఖండలో బాలకృష్ణ దాకా ఎన్నో ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తాయి. ఇదంతా చరిత్రలో ఉన్న వాస్తవమే. మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరమే లేదు.

టికెట్ రేట్లు కేవలం రెండు మూడు రూపాయలు ఉన్న కాలంలోనే అడవిరాముడు ప్రభంజనం కోట్ల రూపాయలను రుచి చూపించింది. ఒరిజినల్ వెర్షన్ల కన్నా మంగమ్మ గారి మనవడు, ఘరానా మొగుడు, ముద్దుల మావయ్య, పెదరాయుడు, చంటి లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించాయంటే మాస్ పల్స్ మీద మన దర్శకులకున్న పట్టే. రాఘవేంద్రరావు నుంచి అనిల్ రావిపూడి ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో కమర్షియల్ జానర్ ని కొత్త పుంతలు తొక్కించారు. జవాన్ ని చూసి మురిసిపోతున్నాం కానీ ఇలాంటి హీరోయిజం బోయపాటి శీను తులసి, లెజెండ్ లాంటి వాటిలో ఎన్ని చూపించలేదు.

రాజమౌళి సింహాద్రి, విక్రమార్కుడులో ఎలివేషన్లను లెక్కబెట్టుకుంటూ వెళ్తే గంటలు చాలవు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఉత్తరాది ప్రేక్షకులను ఎలా కట్టిపడేశాయి. అవి చూసే మేమెంతో స్ఫూర్తి చెందానని సాక్ష్యాత్తు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లే ఒప్పుకున్నారు. ఈ ఏడాదిలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి కురిసిన కనక వర్షం మర్చిపోతే ఎలా. కాబట్టి ఇప్పుడేదో మనం వెనుకబడి కోలీవుడ్ దూసుకుపోతోంది అనుకుంటే అమాయకత్వమే. సలార్ వాయిదా అనే మాటే ప్రకంపనలు సృష్టించింది. ప్రాజెక్ట్ కె గురించి దేశమంతా ఎదురు చూస్తోంది. అడగ్గానే బాలీవుడ్ లెజెండ్స్ నటించారు.

ఎలా చూసుకున్నా దక్షిణాది నుంచి మాస్ డామినేషన్ మొదలయ్యింది తెలుగు నుంచే. నరసింహ, అరుణాచలంలు మనవి కాకపోవచ్చు. కానీ సమరసింహారెడ్డి, ఇంద్ర సునామి ఎవరివి. బాషా మాదని అరవ మిత్రులు చెప్పుకోవచ్చు. కానీ అసలదే అమితాబ్ బచ్చన్ హమ్ నుంచి స్ఫూర్తి పొందింది. కాబట్టి ప్రతి సింహానికి ఒక రోజు వస్తుందని సామెత చెప్పినట్టు ఇప్పుడేదో మనోళ్లు కొంత నెమ్మదించి ఉండవచ్చు. అంతమాత్రాన తక్కువంచనా వేస్తే ఎలా. రేపు భగవంత్ కేసరి కావొచ్చు లేదా గుంటూరు కారం అవ్వొచ్చు. సరైన టాక్ వస్తే దిమ్మదిరిగే స్థాయిలో మళ్ళీ రికార్డుల వేట మొదలుపెడతాయి. ఎటొచ్చి ఇవన్నీ మనకు కొత్త కాదు. 

This post was last modified on September 9, 2023 12:38 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago