Movie News

మంచి వీకెండ్‌ను ఇలా వదిలేశారే..

ఈ మధ్య కొత్త సినిమాల విడుదల తేదీల గురించి ఎన్ని వార్తలు వస్తున్నాయో.. వాయిదాల గురించి అంతకుమించిన న్యూస్‌లు చూస్తున్నాం. ముఖ్యంగా ‘సలార్’ సినిమా వాయిదా గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఆ సినిమా పోస్ట్ పోన్ కావడం వల్ల చాలా సినిమాల డేట్లు అట ఇటు ఇటు అయ్యాయి. తాజాగా ‘చంద్రముఖి-2’ సినిమా వాయిదా న్యూస్ బయటికి వచ్చింది. ఈ నెల 15న ఈ సినిమా రావట్లేదని తేలిపోయింది.

సెప్టెంబరు 28కి వాయిదా అంటున్నారు కానీ.. ఆ రోజు కూడా సినిమా రావడం సందేహమే అంటున్నారు. అసలే ట్రైలర్‌కు పూర్ రెస్పాన్స్ రాగా.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కానీ ఇప్పటికే ‘స్కంద’ సినిమాను సెప్టెంబరు 14 నుంచి 28కి వాయిదా వేశారు. ఇప్పుడు ‘చంద్రముఖి-2’ కూడా వాయిదా పడటంతో మంచి వీకెండ్ వేస్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

సెప్టెంబరు చివర్లో వచ్చేది క్రేజీ వీకెండే కావచ్చు. కానీ అందులో ప్రతికూలతలు లేకపోలేదు. సరిగ్గా గణేష్ నిమజ్జనం రోజు చాలా సినిమాలు రిలీజవుతుండటం ప్రతికూలమే. వాటి డే-1 వసూళ్ల మాత్రం ప్రతికూ ప్రభావం పడుతుంది. పైగా పోటీ మరీ ఎక్కువ అయిపోవడంతో ఏ సినిమాకూ ఆశించిన వసూళ్లు రావు. ఇక సెప్టెంబరు 15 సంగతి చూస్తే ‘స్కంద’ ఆల్రెడీ వెనక్కి వెళ్లింది.

ఇప్పుడు ‘చంద్రముఖి-2’ కూడా రావట్లేదు. ఇక మిగిలింది ‘మార్క్ ఆంటోనీ’ మాత్రమే. ఈ వీకెండ్లో ఒక్క తమిళ డబ్బింగ్ మూవీతో ప్రేక్షకులు సర్దుకోవాలి. దీని బదులు ‘స్కంద’నే యధావిధిగా 15న వస్తే దానికి  భారీ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. అది వెనక్కి రాలేని పరిస్థి ఉన్నా రూల్స్ రంజన్, పెదకాపు, మ్యాడ్ లాంటి చిన్న సినిమాల్లో ఒకటో రెండో ప్రి పోన్ అయి 15న వస్తే వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తే మంచిది.

This post was last modified on September 8, 2023 9:02 pm

Share

Recent Posts

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

4 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

5 hours ago