‘కార్తికేయ 2’ తో యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నార్త్ లో ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో నిఖిల్ లైనప్ మారిపోయింది. అప్ కమింగ్ మూవీస్ అన్నీ భారీ స్కేల్ తో చేస్తున్నాడు. అయితే కార్తికేయ షూటింగ్ టైమ్ లోనే తనకి ‘స్వామీ రారా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ తో ఓ సినిమా చేశాడు నిఖిల్. లండన్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా ఘాట్ చేశారు. మరో వారం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని నిఖిల్ దర్శకుడు ఇద్దరూ మీడియాతో చెప్పుకున్నారు. కానీ నిఖిల్ ఆ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇవ్వలేదు.
ప్రెజెంట్ తన భారీ లైనప్ మీదే ఫోకస్ పెట్టాడు. దీంతో నిఖిల్ సుధీర్ వర్మ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయమని నిర్మాతలను హీరో నిఖిల్ రిక్వెస్ట్ చేసినట్లు అప్పట్లో ఇన్సైడ్ టాక్ వచ్చింది. మరి రష్ చూసి ఏమైనా డిస్కషన్ జరిగిందా తెలియదు కానీ ఇంత వరకూ ఆ సినిమా అప్ డేట్ మాత్రం బయటికి రాలేదు.
స్వామి రారా తర్వాత సుధీర్ వర్మ కి సరైన హిట్ లేదు. రీసెంట్ గా రావణాసుర తో డిజాస్టర్ డెలివరీ చేశాడు. డానికి ముందు షాకినీ దాకినీ తీసి ఫ్లాప్ ఇచ్చాడు. మరి ఈ నేపథ్యం లో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే తన బ్రాండ్ మీద ఎఫెక్ట్ అవుతుందని నిఖిల్ భావిస్తున్నాడా ? లేదా ఈ సినిమాను భారీ లైనప్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాడా ? తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ తన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ సినిమా ట్రైనింగ్ కోసం విదేశాలు వెళ్ళాడు. మూడు నెలల పాటు అక్కడే ట్రైన్ అవ్వబోతున్నాడు. మరి సుధీర్ , నిఖిల్ సినిమా బయటికి వచ్చేదెప్పుడో ?
This post was last modified on September 8, 2023 4:35 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…