మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు భాషలలోకి దుల్కర్ సల్మాన్ సినిమాలు డబ్ అవుతున్నాయి. ఇక తెలుగులో డైరెక్ట్ గా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ మరింత చేరువయ్యాడు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న దుల్కర్ సల్మాన్…మోడ్రన్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. సీతారామం చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మార్కెట్ కూడా పెరిగింది.
ఆ చిత్రం తర్వాత దుల్కర్ నటించిన మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలో, పోలీస్ ఆఫీసర్ వంటి సాఫ్ట్ పాత్రలలో నటించిన దుల్కర్ సల్మాన్ తొలిసారి ఫుల్ ఫ్లెడ్జెడ్ మాస్ పాత్రలో నటించారు. అయితే, మలయాళంలో మాస్ దుల్కర్ సల్మాన్ ను అక్కడి ప్రేక్షకులు ఆదరించినా తెలుగు ప్రేక్షకులను మాత్రం కింగ్ ఆఫ్ కోతా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే సీతారామం తర్వాత నేరుగా తెలుగులో మరో చిత్రంలో నటించేందుకు దుల్కర్ సల్మాన్ రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ దర్శకుడు పరుశురాం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవి తన తొలి చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమా పతాకంపై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో దుల్కర్ సరసన నటించబోతున్న హీరోయిన్ ఎవరు అన్నది అన్నది వెల్లడి కావాల్సి ఉంది. దుల్కర్ నటించబోతున్న ఈ ప్రేమ కథ చిత్రంలో సగభాగం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. మరి, సీతారామం తరహాలోనే ఈ లవ్ స్టోరీ కూడా దుల్కర్ కు భారీ హిట్ తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on September 7, 2023 5:54 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…