మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న భోళా శంకర్ ఎంత ఘోరమైన తిరస్కారానికి గురయ్యిందో 55 కోట్ల నష్టం బాక్సాఫీస్ సాక్షిగా ఋజువు చేసింది. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఏదో యావరేజ్ గా ఉన్నా జనం ఆ రేంజ్ లో ముప్పేటదాడి చేసేవాళ్ళు కాదు కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో మొదటి రోజు సాయంత్రానికే యూనిట్ మొత్తం సైలెంట్ అయిపోయింది. మొదటి వారం అవ్వకుండానే తీవ్రమైన డెఫిషిట్లు వచ్చిన మెగా మూవీగా దీని రికార్డులు ఇప్పట్లో చెక్కుచెదిరేలా లేవు.
ఇదిలా ఉండగా భోళా శంకర్ ఓటిటి ప్రీమియర్ కు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. షూటింగ్ లో ఉండగానే నెట్ ఫ్లిక్స్ హక్కులు కొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వరసగా వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ లతో పాటు దీన్ని కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో పాటు సమాంతరంగా రిలీజైన జైలర్ ఇరవై రోజులకే డీజిటల్ లో వచ్చేయగా భోళా శంకర్ మాత్రం నెలకు పైగా టైం తీసుకోవడం విశేషం. ఇది వస్తున్నందుకు మెగా ఫ్యాన్స్ లో ఆనందం లేదు కానీ ఫ్రెష్షుగా హెచ్డి ట్రోలింగ్ చవి చూడాల్సి వస్తుందని ఒకటే భయపడుతున్నారు.
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం, ఖుషి నడుము సీన్ అడ్డంగా మిస్ ఫైర్ కావడం, నీరసమైన సెంటిమెంట్, బి గ్రేడ్ కామెడీ సన్నివేశాలతో మెహర్ రమేష్ చిరాకు తెప్పించడం ఇవన్నీ నెటిజెన్లు టార్గెట్ చేసుకుంటారు. పైగా థియేటర్ లో చూడని వాళ్ళు భారీగా ఉన్నారు కాబట్టి నెట్ ఫ్లిక్స్ లో రావడం ఆలస్యం ఒక షో చూద్దామని ప్లాన్ చేసుకునేవాళ్లే ఎక్కువ. సో తిట్టిపోయడానికి కొత్త బ్యాచ్ ఒకటి వచ్చేస్తుందన్న మాట. ఏజెంట్ కూడా దీని బారిన పడేదే కానీ ఎందుకో హక్కులు కొన్న సోని లివ్ స్ట్రీమింగ్ ని వాయిదా వేసుకుంటూ పోయి అసలు రిలీజ్ చేసే ఉద్దేశమే లేదన్న స్టేజికి వచ్చేసింది.
This post was last modified on September 7, 2023 10:29 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…