హారర్ క్లాసిక్ గా నిలిచిపోయిన రజనీకాంత్ చంద్రముఖికి కొనసాగింపు లారెన్స్ తో వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 విడుదలకు రంగం సిద్ధమయ్యింది. త్వరలోనే హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నారు. ముందు నుంచి దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన లైకా ప్రొడక్షన్స్ హిందీలో మాత్రం రిలీజ్ చేయడం లేదు. ఇన్స్ టా గ్రామ్ లో హీరోయిన్ కంగనా రౌనత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ తర్వాత ఓటిటి, శాటిలైట్ ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయమని, బాలీవుడ్ జనాలు మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నానని పోస్ట్ చేసింది.
ఇలా ఎందుకు చేశారంటే చంద్రముఖి 2 సౌత్ లో వర్కౌట్ అయినంతగా నార్త్ ఆడియన్స్ దగ్గర అవ్వకపోవచ్చనే అనుమానం టీమ్ లో ఉందట. ఎందుకంటే మొదటి భాగాన్ని అక్షయ్ కుమార్ తో భూల్ భులాయ్యాగా రీమేక్ చేసి పెద్ద సక్సెస్ అందుకున్నారు. పూర్తిగా వేరే కథతో గత ఏడాది రెండో భాగం కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత టైటిల్ తీసుకుని అనువాదం చేస్తే జనానికి ఎక్కక పోవచ్చు. పైగా లారెన్స్ కి అక్కడి పబ్లిక్ లో పాపులారిటీ లేదు. అయితే కంగనా రౌనత్ ని పెట్టుకుని మరీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం అంతు చిక్కని విషయం.
ఇప్పటికే చంద్రముఖి 2 సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది. సీక్వెల్ తీస్తామని చెప్పి రీమేక్ చేశారేంటని దర్శకులు పి వాసుని నిలదీస్తున్నారు. చెన్నై వర్గాలు మాత్రం ఎలాంటి అంచనాలు రేపకుండా థియేటర్ లో సర్ ప్రైజ్ ఇచ్చేలా సెకండ్ హాఫ్ ని టెర్రిఫిక్ గా తీశారని, లారెన్స్ కంగనాల మధ్య సీన్లు మాస్ జనాలను ఊపేస్తాయని ఊరిస్తున్నారు. ఎంఎం కీరవాణి పాటలు తమిళంలో బాగానే ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. ప్రొడక్షన్, మ్యూజిక్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తున్న చంద్రముఖి 2 ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on September 7, 2023 2:07 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…