విడుదల తేదీల ప్రహసనాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సలార్ రగిలించిన వాయిదా చిచ్చు చాలా దూరం వెళ్తోంది. సెప్టెంబర్ 28 నుంచి అది తప్పుకోవడం ఆలస్యం మేమంటే మేమంటూ మీడియం సినిమాలు డేట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు గడవనే లేదు అప్పుడే మార్పుల పర్వం మొదలయ్యింది. ముందుగా అనౌన్స్ చేసిన సితార ఎంటర్ టైన్మెంట్ మ్యాడ్ ఇప్పుడు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె పరిచయమవుతున్న ఈ యూత్ ఫుల్ టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు.
ఇప్పుడీ నిర్ణయం వెనుక కారణాలు స్పష్టం. 15 నుంచి స్కంద హఠాత్తుగా 28 కి షిఫ్ట్ కావడం మాస్ సెంటర్స్ లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా రామ్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా యూత్ మొదటి ప్రాధాన్యం స్కంద అవుతుందే తప్ప మ్యాడ్ కాదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బోయపాటి శీను ర్యాంపేజ్ మాములుగా ఉండదు. అప్పుడు ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. కిరణ్ అబ్బవరం ఎంత ఫ్లాపుల్లో ఉన్నా సరే రూల్స్ రంజన్ కి 5 కోట్ల దాకా బిజినెస్ చేసారు. సో థియేటర్ కౌంట్ గట్టిగానే ఉంది. సితార నెట్వర్క్ తో మ్యాడ్ కి స్క్రీన్లు వస్తాయి కానీ అసలైతే ఆడియన్స్ ఓపెనింగ్స్ ఇవ్వాలిగా.
ఇవి కాకుండా శ్రీకాంత్ అడ్డాల పెదకాపు పార్ట్ 1 ఒకరోజు ఆలస్యంగా 29 రానుంది. దీన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కానీ బర్నింగ్ ఇష్యూ మీద చాలా హై ప్రొఫైల్ యాక్షన్ డ్రామాగా తీసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే సహజంగానే బిసి జనాలు దీనికే మొగ్గు చూపుతారు. కొత్త హీరో అయినా సరే పలాస తరహాలో కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మ్యాడ్ ని అక్టోబర్ 6కి జరపాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఆ రోజు సుధీర్ బాబు మామ మశ్చీంద్ర తప్ప పెద్దగా పోటీ లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇచ్చేస్తారు.
This post was last modified on September 7, 2023 10:21 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…