ఇప్పటి తరానికి దివ్యభారతి అంటే ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ 90 దశకంలో పిల్లలు, యువకులుగా ఉన్న వాళ్ళు ఈ అమ్మడిని మర్చిపోవడం అంత సులభం కాదు. వెంకటేష్ బొబ్బిలిరాజాతో తెరకు పరిచయమై డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుని చాలా తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, చిరంజీవి రౌడీ అల్లుడు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్లు కొట్టి విపరీతమైన డిమాండ్ తెచ్చి పెట్టాయి. తర్వాత నా ఇల్లే నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు లాంటి ఫెయిల్యూర్స్ మార్కెట్ ని ప్రభావితం చేశాక బాలీవుడ్ కే అంకితమైపోయింది.
ఆమె చివరి చిత్రం ప్రశాంత్ తో చేసిన తొలిముద్దు. అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిన దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచిపోయింది.1993 ముంబై తన స్వంత అపార్ట్ మెంట్ లో పై అంతస్థు నుంచి పడిపోయి ప్రాణాలు తీసుకుంది. భర్త సాజిద్ నడియాడ్ వాలా ప్రమేయం గురించి పోలీస్ శాఖ ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ గానే బుక్స్ లో ఉండిపోయింది. ఈ సంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా బాంద్రా అనే సినిమా రూపొందుతోందని మల్లువుడ్ టాక్. మిల్కీ బ్యూటీ తమన్నా దివ్యభారతిగా కనిపించనున్నట్టు వినికిడి.
నేరుగా పేర్లను వాడకపోయినా అప్పటి ఘటన ఆధారంగానే బాలీవుడ్ చీకటి కోణాలను స్పృశించడంతో పాటు దివ్యభారతి మరణం వెనుక జరిగిన బయటికి తెలియని వాస్తవాలను చూపించబోతున్నట్టు తెలిసింది. బాంద్రా అధికారికంగా ఆ ప్లాట్ మీద తీస్తున్నామని దర్శకుడు అరుణ్ గోపీ చెప్పనప్పటికీ అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దీని గురించే గొణుక్కుంటున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి హిందీ తెలుగుతో సహా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తారని సమాచారం. ఇది నిజమైతే లేట్ ఇన్నింగ్స్ లోనూ తమన్నాకు మరో ఛాలెంజింగ్ రోల్ దొరికినట్టే.
This post was last modified on September 6, 2023 10:17 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…