మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కృష్ణాష్టమి స్పెషల్ గా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాకు సంబందించి నవీన్ పోలిశెట్టి భారీ ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఎక్కడ ప్రమోషన్స్ లో కనిపించినా , మీడియా ముందుకొచ్చిన నవీన్ కి ఎదరైన రెగ్యులర్ ప్రశ్న.. ప్రమోషన్స్ లో అనుష్క ఎందుకు కనిపించడం లేదు ? ఈ ప్రశ్న టీం కి కూడా ప్రతీ రోజు వస్తుంది. అయితే అనుష్క అధిక బరువు సమస్యతో కాస్త బొద్దుగా కనిపిస్తుందట. సినిమాలో కూడా ఆమె సీన్స్ కి స్పెషల్ గా వర్క్ చేసి స్లిమ్ గా చూపించేందుకు ప్రయత్నించారట.
అయితే ఈ సంగతి టీం ఎక్కడా చెప్పడం లేదు. అనుష్క పెట్టిన కండీషన్ దృష్టిలో పెట్టుకునే టీం ఎక్కడా నోరు మెదపడం లేదు. నవీన్ కూడా స్వీటీ నేను కలిసి ఓ ఇంటర్వ్యూ చేశాం, త్వరలోనే ప్రోమో.. ఆ వెంటనే ఫుల్ ఇంటర్వ్యూ వదులుతున్నాం ఆ ఇంటర్వ్యూ లో అనుష్క కనిపిస్తుంది అంటూ చెప్పుకున్నాడు. నిజమే అనుష్క , నవీన్ లతో సుమ యాంకరింగ్ లో కొద్ది రోజుల క్రితం ఓ కామన్ ఇంటర్వ్యూ ఘాట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వదల్లేని పరిస్తితి కనిపిస్తుంది.
ఇంటర్వ్యూ లో కూడా అనుష్క బొద్దుగా ఉండటంతో కాస్త వర్క్ చేయించే ప్రయత్నం చేశారట. కానీ అది సరిగ్గా కుదరక పోవడంతో ఇంటర్వ్యూ ను పబ్లిక్ లోకి వదలొద్దని స్వీటీ టీంను స్వీట్ గా రిక్వెస్ట్ చేసిందని తెలుస్తుంది. తాజాగా దర్శకుడు మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూ లో అనుష్క గారి ఇంటర్వ్యూ ప్రోమో ఇవ్వాళ ఉంటుందని , ఫుల్ ఇంటర్వ్యూ రేపు లేదా ఎల్లుండి రిలీజ్ చేస్తామని ఏదో చూచాయగా చెప్పి తప్పించుకున్నాడు.
ఏదేమైనా రంగబలి తర్వాత మళ్ళీ ఓ ఇంటర్వ్యూ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేసింది ఇదే. అది కాంట్రవర్సీ తో కామెడీ కాబట్టి దానికోసం బాగా ఎదురుచూస్తే, ఫ్యాన్స్ అనుష్క కోసం ఈ ఇంటర్వ్యూ కోసం చూస్తున్నారు. ఏదేమైనా ఈ ఇంటర్వ్యూ ఇక బయటికి రానట్టే అని తెలుస్తుంది. మరి చూడాలి లాస్ట్ మినట్ లో ఏమైనా వర్కవుట్ అయితే వదులుతారేమో !
This post was last modified on September 6, 2023 9:52 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…