Movie News

నాగ్ సరసన పడుచు భామలు

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత నాగ్‌కు సరైన విజయమే లేదు. అందులోనూ గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాలైతే మరీ నిరాశపరిచాయి. ‘ది ఘోస్ట్’ రిజల్ట్ చూశాక తన మార్కెట్ బాగా దెబ్బ తినేసిందని అర్థం చేసుకున్న నాగ్.. తర్వాతి సినిమాను ఎంచుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు.

ఓ మలయళ సినిమాకు మాస్ టచ్ ఇస్తూ ‘నా సామి రంగా’ పేరుతో కొత్త చిత్రం చేయడానికి నాగ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా గత నెల చివర్లో దీని టీజర్ కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ టీజర్ చూసి సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయిందనుకుంటే పొరపాటే. కేవలం అనౌన్స్‌మెంట్ కోసం ప్రత్యేకంగా షూట్ చేసిన టీజర్ అది.

‘నా సామి రంగా’ రెగ్యులర్ షూట్ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందుకు కొందరి పేర్లు పరిశీలించి.. చివరగా ఇద్దరిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరికీ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’తో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ భామ ఆషికా రంగనాథ్.. నాగ్ సరసన ఒక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. మరో పాత్రకు మాజీ మిస్ ఇండియా మానస వారణాసిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఆమెకు కూడా లుక్ టెస్ట్ పూర్తయింది.

వీళ్లిద్దరూ కూడా నాగ్‌తో పోలిస్తే చాలా చిన్న వాళ్లు. ఆయన పక్కన మరీ చిన్నగా అనిపిస్తారేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కాకపోతే 60 ప్లస్‌లోనూ మంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి నాగ్ పక్కన మరీ ఆడ్‌గా అనిపించకపోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో హీరో ఫ్రెండుగా ఓ కీలక పాత్ర ఉంది. దాని కోసం సీనియర్ నటులు కొందరిని పరిశీలిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 6, 2023 8:14 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago