విజయ్ దేవరకొండ, సమంతల క్రేజీ కాంబినేషన్లో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ సినిమా విడుదలకు ముందు మంచి హైపే తెచ్చుకుంది. ముఖ్యంగా పాటలే ఈ సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే దాని వసూళ్ల కథే వేరుగా ఉండేది. ఐతే యావరేజ్ టాక్‌తోనే ‘ఖుషి’ తొలి వీకెండ్లో భారీ వసూళ్లే రాబట్టింది.
రూ.32 కోట్ల మేర షేర్ రాబట్టింది. సినిమా కాంబినేషన్ రేంజ్, వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇవి చాలా మంచి వసూళ్లనే చెప్పాలి. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. మిక్స్డ్ టాక్‌కు తోడు వర్షాల ప్రభావం సోమవారం నుంచి సినిమా మీద బాగానే పడింది. వీకెండ్ అవ్వగానే వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా క్రాష్ అయిపోయింది.
సోమ, మంగళవారాల్లో కలిపి ‘ఖుషి’ వరల్డ్ వైడ్ రూ.3 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. యుఎస్, నైజాంలో మాత్రమే ఓ మోస్తరుగా షేర్ వచ్చింది. కానీ ఏపీలో సినిమా పూర్తిగా డౌన్ అయిపోయింది. ‘ఖుషి’ బ్రేక్ ఈవెన్ మార్కు రూ.52 కోట్లు కాగా.. ఇంకో 20 కోట్ల టార్గెట్‌తో వీక్ డేస్‌లో ప్రయాణం మొదలుపెట్టిన సినిమా.. రెండు రోజుల వ్యవధిలో రూ.రెండున్నర కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టింది. యుఎస్‌లో ఈ చిత్రం 1.5 మిలియన్ మార్కును టచ్ చేసింది.
అక్కడ మాత్రమే ‘ఖుషి’ బ్రేక్ ఈవెన్ అయింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.16 కోట్లు కాగా.. ఇంకో మూడు కోట్లు మైనస్‌లోనే ఉంది. ఫుల్ రన్లో ఈ మార్కును అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. స్వల్ప నష్టాలు తప్పేలా లేవు. ఏపీలో అయితే ఇంకా రూ.15 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. అక్కడ బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. మొత్తంగా చూస్తే ఒక్క యుఎస్ బయ్యర్ మినహా ‘ఖుషి’ డిస్ట్రిబ్యూటర్లెవ్వరూ ‘ఖుషి’గా లేరన్నది వాస్తవం.
This post was last modified on September 6, 2023 5:56 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…