మనమేదో జనవరి రేసులో ఏమేం సినిమాలు ఉంటాయనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చినట్టు ఫీలవుతున్నాం కానీ కొత్త కొత్త ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ గా రావాలని డిసైడ్ చేసుకున్నవి గుంటూరు కారం, ఈగల్, హనుమాన్ అన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ ని నిర్మాత దిల్ రాజు పండగ బరిలో దింపాలనే లక్ష్యంతోనే షూటింగ్ చేయిస్తున్నారనే టాక్ ఇప్పటికే ఉంది. ఎలాగూ ప్రాజెక్ట్ కె డ్రాప్ అయ్యింది కాబట్టే వీళ్లంతా ధీమాగా ఉన్నారు. సలార్ రాదనే నమ్మకం కూడా తోడయ్యింది.
స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఫ్రెష్ గా కోలీవుడ్ హీరోలు తోడయ్యేలా ఉన్నారు. విక్రమ్ హీరోగా కాలా కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్ ని పొంగల్ బరిలో దింపాలని నిర్మాతలు ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. ఆ టైంలో తెలుగు సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని తెలిసినా కూడా తమిళనాడు మార్కెట్ ని మిస్ చేసుకూడదనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకుని మరీ పని చేస్తున్నారట. శివ కార్తికేయన్ ఫాంటసీ మూవీ అయలాన్ సైతం పండగే కావాలని కూర్చుంది. ఇంకా వేరే పెద్ద హీరోలవేవీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నాయి.
మన నిర్మాతలు ఎలాగూ హక్కులు కొంటారు. ఇక్కడ ఎంత పోటీ ఉన్నా సరే థియేటర్లు ఇప్పించేందుకు పట్టుబడతారు. దానికి తోడు విక్రమ్, శివ కార్తికేయన్ ఇద్దరూ చేస్తున్నవి ప్యాన్ ఇండియా మూవీసే కాబట్టి ఖచ్చితంగా సమాంతర విడుదల ఉంటుంది. వారం పది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రావొచ్చు. సలార్ నవంబర్ లో వస్తుందా లేదా జనవరినా అనేది తేలితే ఇక్కడ చెప్పిన సినిమాల విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు. రాబోయే నాలుగు నెలల్లో చోటు చేసుకోబోతున్న కీలక పరిణామాలు డిస్ట్రిబ్యూటర్లను నిద్రకు దూరం చేసేలా ఉన్నాయి.
This post was last modified on September 6, 2023 3:50 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…