అప్పుడప్పుడూ చిన్న సినిమాలు ఎవ్వరూ ఊహించని విధంగా చాలా పెద్ద హిట్ అయిపోతుంటాయి. ఆ సినిమాల్లో నటించిన వాళ్లు సడెన్‌గా బిజీ అయిపోతుంటారు. ఐతే తమకు వచ్చే అవకాశాలను ఎలా పడితే ఒప్పేసుకుని.. ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఫేడవుట్ అయిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ‘ఆర్ఎక్స్ 100’ అనే సెన్సేషనల్ మూవీతో బిజీ హీరోయిన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్.. చూస్తుండగానే ఎలా డౌన్ అయిపోయిందో తెలిసిందే.
‘ఆర్ఎక్స్ 100’ తరహాలోనే చిన్న సినిమాగా వచ్చి.. దాన్ని మించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బేబి’ సినిమాలో నటించిన ముగ్గురు నటులకూ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య అయితే మామూలుగా పాపులర్ కాలేదు. అందం, అభినయం రెండూ ఉన్న ఈ అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకున్నారు.
ఐతే ‘బేబి’ రిలీజై నెలన్నర దాటినా వైష్ణవి కొత్త సినిమాల గురించి ఏ కబురూ వినిపించకపోయేసరికి ఈ సినిమా సక్సెస్ ఆమెకు ఉఫయోగపడలేదా అన్న చర్చ జరిగింది. కానీ వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోవాలన్న ఆతృత వైష్ణవికి లేదని తెలుస్తోంది. ఉన్న వాటిలో మంచి ఛాన్సులనే ఆమె ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వైష్ణవి కథానాయికగా రెండు సినిమాలు ఓకే అయ్యాయి. అవి రెండూ ఒక స్థాయి ఉన్న సినిమాలే.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో వైష్ణవి కథానాయికగా నటించబోతోంది. అగ్ర నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న సినిమా ఇది. ఇది కాక దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే సినిమాలోనూ వైష్ణవి హీరోయిన్‌గా నటించబోతోంది. అందులో దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరో. అరుణ్ భీమవరపు దర్శకుడు. మొత్తానికి వచ్చిన ఫేమ్‌ను వాడేసుకోవాలనే తాపత్రయంలో తప్పటడుగులు వేసే హీరోయిన్లలా కాకుండా.. వైష్ణవి తెలివిగానే సినిమాలు ఎంచుకుంటోందంటే తనకు మంచి ఫ్యూచర్ ఉన్నట్లే.
This post was last modified on September 6, 2023 1:15 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…