2000 సంవత్సరానికి అటు ఇటు అప్పటి యువతను ఒక ఊపు ఊపేసిన శృంగార తార షకీలా. మలయాళంలో ఆమె నటించిన సాఫ్ట్ పోర్న్ సినిమాలు.. మాలీవుడ్‌లో స్టార్ హీరోలు నటించిన మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు సైతం పోటీగా నిలిచాయి. ఆమె సినిమాలను బ్యాన్ చేయాలంటూ అక్కడి స్టార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే స్థాయిలో షకీలా క్రేజ్ ఉండేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐతే కొన్నేళ్ల పాటు అంత డిమాండ్‌లో ఉన్న షకీలా.. ఆ తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడింది.
ఆమెకు వయసు మీద పడింది. అదే సమయంలో మలయాళంలో సాఫ్ట్ పోర్న్ మూవీస్ హవా తగ్గింది. షకీలా సంపాదనంతా ఆమె అక్కే మోసం చేసి లాగేసుకోవడంతో ఇబ్బంది పడిన విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకుంది షకీలా. కొన్నేళ్లు రెగ్యులర్ సినిమాల్లో కూడా నటించిన షకీలా.. ఈ మధ్య లైమ్ లైట్‌కు పూర్తిగా దూరంగా ఉంది. ఇప్పుడు ‘బిగ్ బాస్ 7’లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో సినీ రంగంలో తాను పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంది షకీలా. అంతే కాక తాను బిగ్ బాస్‌లోకి ఎందుకు వచ్చానో.. తన లక్ష్యమేంటో కూడా ఆమె వివరించింది.
‘‘పదో తరగతి ఫెయిల్ కావడంతో నాన్న నన్ను చితకబాదారు. ఆయన మేకప్‌మెన్‌గా పని చేసేవారు. నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నారు. ఒక సినిమాలో సిల్క్ స్మిత చెల్లెలి పాత్రకు సెలక్ట్ చేశారు. ఐతే కొన్ని సినిమాల్లో నటించాక.. ఓ సినిమా కోసం బట్టలు విప్పేయమన్నారు. అదే విషయం నాన్నకు చెబితే ‘చేయనని చెప్పేయ్’ అని అనేవారు. కానీ అది అంత ఈజీ కాదు. నాన్న చనిపోయాక కుటుంబాన్ని పోషించడం కోసం హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టా. డబ్బు బాగా సంపాదించాను. ఆ డబ్బంతా ఇంటి అటక మీద దాచేదాన్ని. అలా దాచుకుంటే ఆదాయ పన్ను వాళ్లు పట్టుకుంటారు అని అక్క నన్ను భయపెట్టి ఆ డబ్బంతా తన దగ్గర పెట్టుకుంది.
తర్వాత నాకు తిరిగి ఇవ్వలేదు. ఈ రోజు తను బావుంది. నేను మాత్రం ఏమీ లేనిదాన్ని అయిపోయా. నేను చేసిన ఓ సినిమాకు సెన్సార్ చేయకుండా ఆపేశారు. నాలుగేళ్లు ఖాళీగా ఉన్నా. ఆ సమయంలోనే తేజగారు పిలిచి ‘జయం’లో ఛాన్స్ ఇచ్చారు. సినిమాల పరంగా నాపై ఓ ముద్ర పడిపోయింది. ఇప్పటికీ నన్ను ఆ కోణంలోనే చూస్తున్నారు. నాపై ఆ ముద్ర చెరిపేసి నాలో ఉన్న మరో మనషిని జనాలకు చూపించాలనే బిగ్ బాస్‌లోకి వచ్చా. షకీలా అనే పేరును మరిచిపోయి.. నన్ను అందరూ ‘షకీ అమ్మా’ అని పిలవాలని కోరుకుంటున్నా’’ అని షకీలా పేర్కొంది.
This post was last modified on September 4, 2023 6:15 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…