సూపర్ స్టార్ మహేష్ బాబుని పవర్ ఫుల్ క్యామియో కోసం ఒక సినిమా బృందం సంప్రదించిందని, కథ నచ్చినా కూడా చేసేది లేనిది సమాధానం చెప్పలేదనే ప్రచారం హఠాత్తుగా ఊపందుకుంది. అలా అని ఏదో ఆషామాషీ మూవీ కోసమని అనుకునేరు. పవన్ కళ్యాణ్ ఓజి కోసమే ఈ ప్రతిపాదన వెళ్లినట్టుగా ఇన్ సైడ్ టాక్. గతంలో త్రివిక్రమ్ మాట మీద జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ కెరీర్ లో ఇప్పటిదాకా అతిథి పాత్రలు చేయలేదు. ఆ ఉద్దేశం కూడా లేదని పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. అయినా ఇప్పుడీ ప్రొపోజల్ వెళ్లిందంటే ఆసక్తి కలిగించే విషయమే.
ఈ మధ్య కాలంలో స్టార్ల క్యామియోలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. విక్రమ్ లో రోలెక్స్ గా సూర్య, జైలర్ లో నరసింహగా శివరాజ్ కుమార్ చేసిన కాంట్రిబ్యూషన్ చిన్నది కాదు. అందుకే ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా ఈ ట్రెండ్ మీద లుక్ వేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదా అంటే బోలెడున్నాయి. కానీ కథలను సరిగా హ్యాండిల్ చేయలేక దెబ్బ తిన్న వాళ్లే ఎక్కువ. ఉదాహరణకు హ్యాండ్సప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, అధిపతిలో నాగార్జున పాత్రలు ఇలా మంచి స్కోప్ ఉన్నప్పటికీ గెలవలేకపోయాయి.
సో మహేష్ బాబు దగ్గరకి ఓజి ప్రతిపాదన నిజంగా వచ్చి ఉంటే మాత్రం అది త్రివిక్రమ్ ప్రమేయం వల్లే అయ్యుంటుంది. అయితే తన సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా పుకారేనని కొట్టి పారేస్తున్నాయి. గుంటూరు కారం తప్ప ఇంక దేని గురించి ఆలోచించే మూడ్ లో లేడని అంటున్నారు. రాజమౌళి స్క్రిప్ట్ పనులు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి కాబట్టి కొత్త ప్రాజెక్టులు ఎవరైనా సరే జనవరి తర్వాతే మాట్లాడుకుందామని నిర్మాతలతో చెప్పి పంపిస్తున్నారట. సో ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తీసుకోవాలి. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంతో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో మహేష్ బిజీ అవుతున్నాడు.
This post was last modified on September 4, 2023 1:09 pm
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు…