సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరగబోయే సైమా అవార్డుల ఈవెంట్ కి సంబంధించి నిన్న హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రానాతో పాటు ఇతర గెస్టులు హాజరయ్యారు కానీ అందరికన్నా హైలైట్ అయ్యింది మాత్రం హీరోయిన్ మీనాక్షి చౌదరినే. రెడ్ హాట్ డ్రెస్ లో యద సోయగాలను ప్రదర్శించడంతో అమ్మడిని ఎక్కువ సేపు క్లిక్ చేస్తూ కెమెరాలు ఆలాగే ఉండిపోయాయి. ఈ పిక్స్ సోషల్ మీడియాలో రావడం ఆలస్యం వెంటనే వైరలయ్యాయి. మీనాక్షిలో ఇంత గ్లామర్ ఉందాని ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడం చకచకా జరిగాయి. వంద మాటలు చేయలేని పని ఫోటోలు కానిచ్చాయి.
టాలీవుడ్ కెరీర్ ని ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడీ లాంటి డిజాస్టర్లతో మొదలుపెట్టిన మీనాక్షి చౌదరికి హిట్ 2 ది సెకండ్ కేస్ మంచి బ్రేక్ ఇచ్చింది. అందులో పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినా అమ్మడిలో స్పార్క్ జనానికి పరిచయం అయ్యింది. గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకుని ఆ ప్లేస్ లో శ్రీలీల వచ్చాక ఆ రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోల అభిమానులు తనెవరబ్బాని ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. వరుణ్ తేజ్ మట్కాలోనూ తనే కథానాయకన్న సంగతి తెలిసిందే. ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయి.
ఇలాంటి టైంలో వీలైనంత ఎక్కువ మీడియా కెమెరాలో నానడం వల్ల హీరోయిన్లకు తమ ప్లస్సులను చూపించుకోవడానికే ఛాన్స్ దొరుకుతుంది. ప్రస్తుతం తెలుగు హీరోలు దర్శకులకు శ్రీలీల తర్వాత బెస్ట్ ఆప్షన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రష్మిక మందన్న, పూజా హెగ్డేలు ఫామ్ తగ్గడంతో పాటు అంత సులభంగా దొరికే అవకాశం లేకపోవడంతో కొత్తవాళ్లను ఎంపిక చేసుకోవడం సవాల్ గా మారింది. అందుకే త్రివిక్రమ్ సైతం బాగా ఆలోచించి కాచి వడబోసి మీనాక్షి చౌదరిని లాక్ చేసుకున్నాడు. గుంటూరు కారం కనక బ్లాక్ బస్టర్ అయితే మీనాక్షి చౌదరికి బ్రేకులు వేయడం కష్టమే.
This post was last modified on September 4, 2023 12:40 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…