ఎప్పుడో మార్కెట్ పడిపోయింది, పేరుకి మొక్కుబడిగా సినిమాలు చేయడమే తప్ప ఇంకేం మిగల్లేదన్న రీతిలో ఉన్న 65 సంవత్సరాల సన్నీ డియోల్ కు గదర్ 2 ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా లెక్కలన్నీ మార్చేసింది. నెల తిరక్కుండానే ఏకంగా 500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి ఈ ఏడాది పఠాన్ తర్వాత చోటు దక్కించుకోవడం ఎవరూ ఊహించనిది. దెబ్బకు పోటీలో ఉన్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మంచి కంటెంట్ తోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ ఇవ్వలేకపోయిందంటేనే గదర్ 2 తాలూకు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా ఇది మాములు విజయం కాదు.
మొత్తం బాలీవుడ్ కి ఈ ఫలితం సూపర్ కిక్ ఇచ్చింది. ఎంతగా అంటే మొత్తం స్టార్లందరూ కలిసి సక్సెస్ పార్టీకి వచ్చేంత. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ లాంటి కుర్ర తరం దాకా ప్రతి ఒక్కరు హాజరయ్యాయి. ఇంత అపూర్వ సమ్మేళనం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. పైగా అందరూ జంటలుగా రావడం మరో విశేషం. గదర్ 2తో సంబంధం లేని టెక్నికల్ టీమ్ కూడా ఈ సంబరంలో పాలు పంచుకుంది. కాజోల్, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్, సునీల్ శెట్టి, అనిల్ కపూర్, జాకీ శ్రోఫ్ ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్ట్ ఉంది.
ఈ ఫోటోలు, వీడియోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కలిసి నటించిన డర్ తర్వాత షారుఖ్, సన్నీల మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా పలకరించుకోవడం అభిమానులను కదిలించింది. ఆరు పదుల వయసులో ఉన్న హీరోకు మద్దతుగా ఇంత మంది రావడం విశేషమే. బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న గదర్ 2 ఈ గురువారం జవాన్ వచ్చాక బ్రేకులు పడబోతున్నాయి. ఎలాగూ ఫైనల్ రన్ వచ్చేసింది కాబట్టి నెంబర్లలో పెద్దగా మార్పులు ఉండవు. ఇలాంటి అపూర్వ సంగమాలు టాలీవుడ్ లోనూ తరచు జరగాలి.
This post was last modified on September 4, 2023 12:34 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…