టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్‌లో నాగచైతన్య-సమంతలది ఒకటి. వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర్నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉన్నారు. పెళ్లి, ఆ తర్వాతి సమయంలోనూ అందరూ ఈ జంటను చూసి ముచ్చటపడ్డారు. అలాంటి జంట విడిపోవడం, విడాకులు తీసుకోవడం ఎవ్వరికీ నచ్చలేదు.
విడాకుల తర్వాత నాగ్ కుటుంబం.. సమంత గురించి మాట్లాడ్డం మానేసింది. సమంత కూడా అంతే. చైతూ, సామ్ ఇద్దరూ ఆ ఫేజ్‌ను దాటి వారి వారి జీవితాల్లో ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి సమయంలో చైతూ తండ్రి నాగార్జున సమంత గురించి మాట్లాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఆదివారమే ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ షో ప్రోమోలో నాగ్.. సమంత ప్రస్తావన తేవడం చర్చనీయాంశం అయింది. ఈ షో తొలి ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. తనతో పాటు నవీన్ పొలిశెట్టి కూడా షోలో సందడి చేశాడు. ఖుషి ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చిన విజయ్.. అందులోని పాటకు డ్యాన్స్ కూడా చేశాడు. ఐతే ఈ డ్యాన్స్ అయ్యాక విజయ్‌ని బిగ్ బాస్ షోలోకి ఆహ్వానిస్తూ.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ అని అడిగాడు నాగ్. దీంతో ఆడిటోరియం హోరెత్తింది.
షో కోసం ఎంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించినప్పటికీ.. తన మాజీ కోడలి గురించి నాగ్ ఇలా మాట్లాడతాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఈ వీడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కొన్ని నెలల నుంచి అమెరికాలో ఉంటూ అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఖుషి ప్రమోషన్లలో కూడా ఆమె పెద్దగా కనిపించలేదు. విజయే పూర్తి బాధ్యత తీసుకుని సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
This post was last modified on September 4, 2023 10:22 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…