ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి హారర్ జానర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ థ్రిల్లర్ కు పి వాసు దర్శకత్వం, జ్యోతిక నటన, విద్యాసాగర్ సంగీతం మాములు రికార్డులు అందివ్వలేదు. చెన్నైలో ఏకంగా ఏడాది అడగా తెలుగులోనూ వంద రోజుల వేడుక జరుపుకుంది. అంత క్లాసిక్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపంటే అంచనాలు రేగడం సహజం. అందులోనూ రజని స్థానంలో లారెన్స్ రావడం, టైటిల్ పాత్ర కంగనా రౌనత్ చేయడం ఆసక్తిని పెంచింది. సెప్టెంబర్ 15 విడుదల కాబోతున్న చంద్రముఖి 2 ట్రైలర్ వచ్చింది.
వీడియో చూస్తుంటే కథాపరంగా పెద్దగా మార్పులు చేసినట్టు లేదు. ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్న బంగాళాకు ఓ కార్యం కోసం వస్తాడో యువకుడు(లారెన్స్). ఇతనితో పాటు వేర్వేరు పనుల మీద కొందరు అక్కడ గుమికూడతారు. పైన తాళం వేసిన గదిలో ఉన్న చంద్రముఖి(కంగనా రౌనత్)అప్పుడప్పుడు కవ్విస్తూ ఉంటుంది. దెయ్యం జాడ కోసం వచ్చిన భూత వైద్యుడు(రావు రమేష్) పరిస్థితిని చూసి భయపడతాడు. పూర్వజన్మలో శత్రువుల సింహస్వప్నం వెట్టైరాజు(లారెన్స్)కు ఇక్కడ నృత్యాలతో బెదరగొడుతున్న చంద్రముఖికి సంబంధం పసిగడతాడు.
దర్శకులు పి వాసు రిస్క్ లేకుండా మళ్ళీ పాత కథనే రిస్క్ లేకుండా తిప్పి రాసుకున్నట్టు అనిపించింది. కమెడియన్ వడివేలుతో సహా పాత ఆర్టిస్టులను రిపీట్ చేయగా ఈసారి ప్రభు, నాజర్ లాంటి వాళ్ళను పక్కనపెట్టి వేరే క్యాస్టింగ్ తో ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు. వెట్టై రాజు ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి ఏమైనా కొత్తగా చూపించారేమో తెరమీద బొమ్మ పడితే కానీ క్లారిటీ రాదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి దీనికి సంగీతం సమకూర్చడం విశేషం. హారర్ ప్రియులకు ఎంతో ఇష్టమైన సీక్వెల్ గా చంద్రముఖి మీద మంచి అంచనాలున్నాయి. అసలు ట్విస్టులు థియేటర్లో చూశాక షాక్ ఇస్తాయేమో చూద్దాం
This post was last modified on September 3, 2023 5:12 pm
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…