Movie News

మెగా 156 మరీ ఇంత నెగిటివిటీనా

భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండు రోజులకే ఏదో చికిత్స కోసం ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా దర్శకుడెవరో ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కళ్యాణ్ కృష్ణ అనేది బహిరంగ రహస్యమే అయినా ఆ మధ్య పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ లో మాత్రం పేరు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఏదో చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలు ఇచ్చినట్టేగా. మెగా ఫాన్స్ ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని డైరెక్టర్లతో చిరు పనిచేయడాన్ని ఇష్టపడటం లేదు. కళ్యాణ్ కృష్ణకు హిట్లున్నా సరే అతను వరస సక్సెస్ లలో లేని మాట వాస్తవం.

ఇప్పుడా పేరుని బయటికి చెప్పేస్తే అభిమానులు మళ్ళీ ఎక్కడ ట్రోలింగ్ చేస్తారనే ఆలోచనతో వాతావరణం కాస్త నెమ్మదించాక అనౌన్స్ మెంట్ ఇవ్వాలనే ఆలోచనలో నిర్మాత సుస్మిత కొణిదెల ఉందట. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఏ ట్వీట్లు కనిపించినా ఫ్యాన్స్ మాత్రం నెగటివ్ ఫీడ్ బ్యాకే ఇస్తున్నారు. దీనికి బదులు యువి సంస్థ వశిష్టతో లాక్ చేసిన మెగా 157న ముందు షూటింగ్ చేయమని కోరుతున్నారు. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. ఎందుకంటే 156 ఖచ్చితంగా సుస్మితకే చేయాలని ఆల్రెడీ కమిట్ మెంట్ జరిగిపోయింది. మార్చే ఛాన్స్ లేనట్టే .

కాకపోతే ఇంత నెగటివిటీని దాటుకుని బెస్ట్ కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా తిరిగింది. కాదని అఫ్ ది రికార్డు యూనిట్ సభ్యులు చెబుతున్నా జనాలకు నమ్మకం కుదరడం లేదు. ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే సగం సమస్య తీరిపోతుంది. బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన ఫ్రెష్ స్టోరీ అని వినిపిస్తున్నా అదేదో ఓపెన్ గా చెప్పేస్తే ఏ గొడవ ఉండదు. బంగార్రాజు తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ కృష్ణకి సరైన కథ కుదిరిస్తే నాగార్జునలాగే మెగాస్టార్ ని కూడా డీల్ చేయగలడు. చూడాలి మరి. 

This post was last modified on September 3, 2023 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago