Movie News

ఈ ఏడాదికి ‘ఖుషి’నే నంబర్ వన్

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్.. ఇలా వరుసగా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు తిన్న హీరో విజయ్ దేవరకొండ. ఇలాంటి ట్రాక్ రికార్డు తర్వాత కూడా అతడి కొత్త చిత్రం ‘ఖుషి’కి మంచి హైప్ వచ్చింది. ఫుల్ పాజిటివ్ బజ్‌తో రిలీజైందీ సినిమా. టాక్ మరీ గొప్పగా లేకపోయినా.. వాచబుల్ అన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ‘ఖుషి’కి బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందన వస్తోంది.

సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మెజారిటీ షోలు ఫుల్స్ పడిపోయాయి. ఇక యుఎస్‌లో అయితే ‘ఖుషి’ ఊపు మామూలుగా లేదు. కొత్తగా పేరున్న హాలీవుడ్ సినిమాలేవీ రాకపోవడం దీనికి కలిసొచ్చి.. యుఎస్ బాక్సాఫీస్‌లో ప్రిమియర్స్ డే నుంచి నంబర్ వన్ స్థానంలో ‘ఖుషి’ ట్రెండ్ అవుతుండటం విశేషం. హాలీవుడ్ పాత సినిమాలతో పోటీ పడి అయినా సరే.. విజయ్ రేంజ్ హీరో సినిమా నంబర్ వన్ స్థానంలో నిలవడం అంటే చిన్న విషయం కాదు.

ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ఈ ఏడాదికి తెలుగులో ప్రిమియర్స్ తర్వాతి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఖుషి’ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం ఈ సినిమాకు యుఎస్‌లో ఏకంగా 3.50 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. 3 లక్షల డాలర్లతో చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ నెలకొల్పిన రికార్డును ఈ సినిమా అధిగమించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజైన భారీ చిత్రాలు తక్కువే అయినప్పటికీ.. విజయ్ సినిమా తెలుగు నుంచి రిలీజ్ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం చిన్న విషయం. ఓవరాల్‌గా ‘ఖుషి’ శుక్రవారం షోలన్నీ అయ్యేసరికి 8 లక్షల డాలర్ల మార్కును దాటేయడం విశేషం.

This post was last modified on September 2, 2023 11:08 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

1 hour ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

4 hours ago