ఈ కాంబినేషన్ వినగానే చాలామందికి షాకింగ్‌గా అనిపించొచ్చు. కమల్ హాసన్, విజయ్ లాంటి హీరోలతో సినిమాలు చేసి.. రజినీకాంత్‌తో సైతం ఓ కమిట్మెంట్ ఉన్న లోకేష్ కనకరాజ్ ఏంటి.. రాఘవ లారెన్స్‌తో సినిమా చేయడం ఏంటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఐతే లోకేష్.. లారెన్స్‌తో సినిమా చేయబోతున్న మాట వాస్తవం. కానీ ఆ చిత్రానికి అతను దర్శకుడు కాదు. రైటర్ మాత్రమే.
లోకేష్ కనకరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రంలో లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. ఇంతకుముందు అమలా పాల్‌తో ‘ఆమె’ సినిమా చేసిన రత్నకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో లారెన్స్ సరసన నయనతార నటించబోతోంది. ఈ వెరైటీ కాంబినేషన్లో సినిమా ఓకే అయిపోయిందట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతోందట.
ఊర మాస్ సినిమాలు చేసే లారెన్స్ హీరోగా సినిమా చేయడానికి లోకేష్ ఓ కథ రాశాడన్నా కూడా ఆశ్చర్యమే. వీళ్లిద్దరి స్టైల్‌కు అసలు పొంతన ఉండదు. లోకేష్ సినిమాలో మాస్ ఉంటుంది కానీ.. అది చాలా స్టైలిష్‌గా, కొత్తగా ఉంటుంది. లారెన్సేమో మరీ నాటు సినిమాలు చేస్తుంటాడు. అతడి యాక్టింగ్ స్టైల్ మరీ ఓవర్‌గా ఉంటుంది. మరి ఇలాంటి కాంబినేషన్ అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
‘ఆమె’ అనే బోల్డ్ సినిమా కంటే ముందు రత్నకుమార్ తెలుగు కుర్రాడు వైభవ్ రెడ్డి హీరోగా ‘మెయ్యాదమాన్’ అనే సినిమా చేశాడు. అది సూపర్ హిట్టయింది. ప్రస్తుతం లారెన్స్ ‘చంద్రముఖి-2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, మరోవైపు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తున్న నయన్.. లారెన్స్‌కు జోడీగా నటించడం కూడా ఆసక్తి రేకెత్తించేదే.
This post was last modified on September 2, 2023 10:40 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…