పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన స్టామినాకు తగ్గ.. స్ట్రెయిట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు శాంపిల్ చూశారు ప్రేక్షకులంతా. సాహో డైరెక్టర్ సుజీత్‌తో పవన్ చేస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించేసింది. ఫ్యాన్స్ అనే కాకుండా యూత్ అంతా కూడా ఈ టీజర్ చూసి ఊగిపోతున్నారు. ఈ టీజర్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.
ఇంటర్నల్ సోర్సెస్ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు టీజర్ విశేషాలు చెబుతూ.. కంటెంట్ మామూలుగా ఉండదంటూ హింట్స్ ఇవ్వడంతో అభిమానుల్లో హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి స్థితిలో సుజీత్ అంచనాలను అందుకోగలడా అన్న సందేహాలు కలిగాయి. కానీ అతను హైప్‌కు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్‌ను తీర్చిదిద్దడంతో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఈ రోజు ఉదయం టీజర్ లాంచ్ అయిన దగ్గర్నుంచి పవన్ ఫ్యాన్స్ అదే పనిగా ఆ వీడియో చూస్తున్నారు.
చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి చాలా ఎగ్జైట్ చేసే టీజర్ రావడంతో అందులోని ఒక్కో షాట్‌ను విశ్లేషించే పనిలో పడిపోయారు. హిడెన్ డీటైల్స్ అన్నీ బయటికి తీసి.. వాటి గురించి చర్చలు పెట్టేశారు. పవన్‌కు ఎలివేషన్ ఇచ్చిన ఒక్కో షాట్‌కు సంబంధించి స్క్రీన్ షాట్లు తీసి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ చేతికి తొడిగిన కడియం మీద జపనీస్ భాషలో ఏదో రాసి ఉండటంతో.. జపాన్ నెటిజన్లను ట్యాగ్ చేసి దాని అర్థం అడుగుతున్నారు.
దానికి అర్థం now here comes the dragon.. అని చెబుతున్నారు. అలాగే టీజర్ చివర్లో పవన్ ఆవేశంతో ఊగిపోతూ మరాఠీ డైలాగ్ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి అర్థం.. ‘‘దావ్‌డే.. ఇంకా వెతుకుతున్నావేం.. ఎక్కడ ఎక్కడ’’ అని అర్థమట. కత్తి కోసం వెతికే క్రమంలో పవన్ చెప్పిన డైలాగ్ ఇది. ఇలాంటి డైలాగులు, షాట్స్‌తో పాటు టీజర్లో వాడిన కాస్ట్యూమ్స్, కత్తి.. గన్ను.. ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా కనిపిస్తుండటంతో వాటి గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.
This post was last modified on September 2, 2023 6:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…