Movie News

కొత్త ట్విస్టు – సల్మాన్ నెత్తి మీద సలార్ బాంబు

నిన్న సాయంత్రం నుంచి సలార్ వాయిదాకు సంబంధించిన వార్త బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరినీ ఊపేసింది. ఊహించని పరిణామాలకు ఒక్కసారిగా షాక్ తిన్న ఇతర నిర్మాతలు మళ్ళీ సలార్ ఎప్పుడు వస్తుందనే టెన్షన్ లో బిపి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకదశలో సంక్రాంతికి ఉండొచ్చనే ప్రచారం మహేష్ బాబు, రవితేజ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగించింది. ఎవరితో పోటీ ఉంటుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. తాజా అప్ డేట్ ఏంటంటే డిసెంబర్ ప్యాక్ అయిన నేపథ్యంలో సలార్ ఫ్రెష్ గా నవంబర్ నెలలో విడుదలయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

ఇది నేరుగా సల్మాన్ ఖాన్ నెత్తి మీద బాంబు వేసినట్టే. ఎందుకంటే నవంబర్ 10న టైగర్ 3 విడుదలకు యష్ రాజ్ ఫిలింస్ సన్నాహాల్లో ఉంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పిన తేదీ మాత్రం అదే. సలార్ దాంతో నేరుగా తలపడకపోవచ్చు. వారం ముందు వచ్చినా లేదా కొంత ఆలస్యంగా వచ్చినా ప్రభాస్ దెబ్బ సౌత్ మార్కెట్స్ లో గట్టిగానే పడుతుంది. ప్రభాస్ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉంది కాబట్టి థియేటర్లు కేవలం కండల వీరుడికే దక్కుతాయని లేదు. పైగా డార్లింగ్ కు అండగా కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ఉన్నారు.

ఈ పరిణామాలు రాను రాను చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు విపరీతంగా పెండింగ్ లో ఉండటంతో పాటు డిజిటల్ హక్కుల విక్రయంలో జరిగిన ఆలస్యం కూడా వాయిదాకు కారణమనే వార్త షికారు చేస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ మాత్రం మంచి అవకాశం పోగొట్టుకుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సెప్టెంబర్ 28 ఇచ్చే లాంగ్ వీకెండ్ ని చేతులారా వదిలేసుకొని నవంబర్ లో అంత అనుకూలంగా లేని టైంలో రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ పరంగానూ నిర్మాతలు చెప్పిన భారీ రేట్ల వల్ల కొన్ని ఏరియాలు ఇంకా క్లోజ్ చేయలేదట. చూడాలి ఇంకా ఏమేం జరుగుతుందో.

This post was last modified on September 2, 2023 5:21 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago