కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. విజయ్, సమంతల క్రేజీ కాంబినేషన్లో నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ‘ఖుషి’ చిత్రం ఈ రోజు మంచి అంచనాల మధ్య రిలీజైంది. ఈ సినిమా మరీ గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా లేదు. యూత్, ఫ్యామిలీస్‌కి ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలు అనే విధంగా సినిమా ఉంది. టాక్ ప్రోత్సాహకరంగా ఉండటంతో ఉదయం నుంచి థియేటర్లు కళకళలాడుతున్నాయి. అదిరిపోయే పాటల వల్ల సినిమాకు ముందు నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ కాగా.. టాక్ కూడా ప్లస్ అయి సినిమా సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది.
ఐతే సినిమాలో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. కథ పరంగా కొత్తదనం ఏమీ లేదు. మణిరత్నం ‘సఖి’ సినిమాను అటు ఇటు తిప్పి తీసినట్లుగా అనిపించింది. ట్విస్టులు, సర్ప్రైజ్‌లు ఏమీ లేకుండా సినిమా ఫ్లాట్‌గా సాగిపోవడం నిరాశ పరిచింది. పాటలు.. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్.. చివర్లో బలమైన ఎమోషనల్ సీన్లు లేకుంటే ‘ఖుషి’ పరిస్థితి వేరుగా ఉండేదన్నది వాస్తవం. ముఖ్యంగా ప్రేమకథలకు అత్యంత కీలకమైన విషయంలో ‘ఖుషి’ తడబడింది.
ఒకరినొకరు మ్యాచ్ చేసే అందమైన జంట ప్రేమకథకు ప్రాణం పోస్తుంది. ఐతే ఈ విషయంలో విజయ్ దేవరకొండ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అతను చాలా అందంగా కనిపించాడు. అలాగే తన పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ అయినా, ఎమోషనల్ సీన్లు అయినా తనకు తిరుగులేదని అతను చాటాడు. కానీ తన ముందు సమంత నిలవలేకపోయింది. వయసు, అనారోగ్యం ప్రభావం వల్లో ఏమో.. ఆమెలో మునుపటి చార్మ్ మిస్సయింది.
ఒకప్పుడు సమంత ప్రేమకథలకు పెద్ద ఎసెట్‌లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తన లుక్స్, ఇమేజ్ అంతలా మారిపోయాయి. విజయ్‌తో ఆమెకు జోడీ కుదరలేదు. విజయ్ లాంటి హ్యాండ్సమ్ కుర్రాడు.. సమంతను చూసి మైమరిచిపోయి.. వెర్రెత్తిపోతుంటే అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. సినిమా అంతటా కూడా సమంత లుక్స్, పెర్ఫామెన్స్ ఆశించినంత గొప్పగా లేవు. ఆమె స్థానంలో ఎవరైనా యంగ్ హీరోయిన్ ఉంటే సినిమా లుక్కే వేరుగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 1, 2023 10:40 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…