తమిళం అనే కాక ఒకప్పుడు సౌత్ ఇండియా అంతటా సూపర్ స్టార్ రజినీకాంత్ హవా మామూలుగా ఉండేది కాదు. రజినీ సినిమాల బడ్జెట్, వసూళ్లు, ఆయన పారితోషకం.. ఇలా ప్రతిదీ వేరే లెవెల్లో ఉండేది. సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమాల వసూళ్లు.. వేరే స్టార్ల బ్లాక్‌బస్టర్ మూవీస్‌కి సమానంగా ఉండేవి అంటే అతిశయోక్తి కాదు. ఆయన సాధించిన ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్‌ను ఎవ్వరూ టచ్ చేయలేరు అనే పరిస్థితి ఉండేది.
కానీ వరుస ఫ్లాపులు ఎలాంటి హీరోనైనా కిందికి లాగేస్తాయని రజినీ విషయంలో రుజువైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో రజినీకి నిఖార్సయిన హిట్టే లేకపోయింది. కబాలి, 2.ఓ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా.. అవి అంతిమంగా సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. రజినీ ఇలా డౌన్ అవుతున్న సమయంలోనే విజయ్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. రజినీని మించి వసూళ్లు రాబడుతూ.. ఆయన్ని మించిన స్టార్‌గా ఎదిగాడు విజయ్. వేరే భాషల్లో కూడా అతడికి ఫాలోయింగ్ పెరిగింది.
దీంతో విజయ్ ఫ్యాన్స్ అతి చేయడం మొదలుపెట్టారు. రజినీని కించపరుస్తూ.. ఆయన పనైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ కాలానికి విజయే సూపర్ స్టార్ అని తీర్మానాలు చేశారు. ఐతే ‘జైలర్’ మూవీతో మొత్తం కథ మారిపోయింది. విజయ్ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి సాధించుకున్న ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ వేస్ట్ అన్నట్లుగా ఆయన ‘జైలర్’ సినిమాతో అన్ని రికార్డులనూ అలవోకగా బద్దలు కొట్టేశారు. తమిళ సినిమాల్లో అన్ని రికార్డులనూ ఈ చిత్రం దాటేసింది. విజయ్ సినిమాలకు.. ‘జైలర్’కు అసలు పొంతనే లేదు.
రజినీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. ఆయనకు తమిళనాడు అవతల కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇమేజ్‌కు తగ్గ సినిమా పడితే.. టాక్ బాగుంటే.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా కలిసొస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ‘జైలర్’ చూపించింది. అందులోనూ విజయ్‌తో ‘బీస్ట్’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితోనే ‘జైలర్’ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇవ్వడంతో రజినీ రేంజ్ ఏంటో అందరికీ అర్థమైంది. రజినీని తక్కువ చేసి మాట్లాడిన విజయ్ ఫ్యాన్స్ అందరికీ ‘జైలర్’ చెంపపెట్టు లాంటి సమాధానమే.
This post was last modified on September 1, 2023 10:31 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…