ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కు గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా అంటే ‘గదర్-2’నే. రెండు దశాబ్దాల కిందటి బ్లాక్‌బస్టర్ మూవీ ‘గదర్’కు కొనసాగింపుగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయాన్నందుకుంది. ఏకంగా ఐదొందల కోట్ల క్లబ్బులో ఈ సినిమా అడుగు పెట్టింది. పూర్తిగా లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయిన సన్నీ డియోల్.. కెరీర్లో ఈ దశలో ఇలాంటి విజయం అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
‘గదర్-2’కు ముందు చాలా ఏళ్లుగా ఆయన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏం సినిమాలు చేస్తున్నాడనే చర్చ కూడా లేదు. ‘గదర్-2’తో ఇంత భారీ విజయాన్ని అందుకున్న సన్నీకి ఆర్థిక సమస్యలు చాలానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ఆయన ఆస్తి ఒకటి వేలానికి కూడా వెళ్లిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కోర్టు జోక్యంతో దాన్నుంచి ఉపశమనం పొందాడు సన్నీ.
కాగా ఒక దర్శకుడు తాజాగా సన్నీ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. 26 ఏళ్ల కిందట తనకు ఇవ్వాల్సిన డబ్బును.. ఇప్పటికీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ సన్నీ మీద ఆరోపణలు గుప్పించాడు సునీల్ దర్శన్. సన్నీతో ఈ దర్శకుడు అజయ్, ఇంతెకామ్, లూటెరె సినిమాలు తీశాడు. ఐతే 1996లో ‘అజయ్’ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సన్నీ అడిగాడట.
సొంతంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ మొదలుపెడున్నానని.. దాని ద్వారా ‘అజయ్’ను రిలీజ్ చేసే అవకాశం ఇవ్వాలని సునీల్‌ను సన్నీ కోరాడట. ఐతే హక్కులు తీసుకున్నాడు కానీ.. అందుకు గానుతనకు ఇస్తానన్న రూ.77.25 లక్షలు ఇవ్వలేదని సునీల్ ఆరోపించాడు. ఇన్నేళ్లుగా ఎన్నోసార్లు అడిగి అడిగి విసుగెత్తిపోయానని.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో తనకు ఒక సినిమా చేస్తానని సన్నీ మాట ఇచ్చాడని.. కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని.. ఇప్పటికైనా తనకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నానని సునీల్ తెలిపాడు. మరి ఈ ఆరోపణలపై సన్నీ ఏమంటాడో చూడాలి.
This post was last modified on September 1, 2023 10:28 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…