రామ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. ‘అఖండ’ తర్వాత బోయపాటి తీసిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ చాలా ఏళ్లుగా నందమూరి బాలకృష్ణతో కాకుండా వేరే హీరోలతో తీసే చిత్రాలతో బోయపాటి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. తొలి చిత్రం ‘భద్ర’ను మినహాయిస్తే.. తులసి, దమ్ము, సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ.. ఇలా దాదాపుగా అన్నీ అంచనాలను అందుకోని సినిమాలే. ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ చూశాక ‘స్కందం’ మీద కూడా సందేహాలు నెలకొన్నాయి.
బోయపాటి మార్కు మైండ్ లెస్ మాస్.. ఓవర్ ఎలివేషన్లు బాలయ్యకు సెట్ అయినట్లు వేరే వాళ్లకు సెట్ కాదని.. ‘వినయ విధేయ రామ’ చూసినపుడే అర్థమైంది. అయినా సరే.. ఇప్పుడు రామ్‌తోనూ అలాంటి ప్రయత్నమే చేసినట్లున్నాడు బోయపాటి. ‘స్కంద’ ట్రైలర్లో కొన్ని షాట్లు.. సీన్లు.. డైలాగులు మరీ అతిగా అనిపించాయి. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలేంటి అనే కామెంట్లు పడ్డాయి. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా జరిగింది.
దీన్ని దృష్టిలో ఉంచుకునే ‘స్కంద’కు యుఎస్ ప్రిమియర్లు క్యాన్సిల్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. యుఎస్ ఆడియన్స్‌కు ఈ తరహా మాస్ మూవీస్ రుచించవు. బోయపాటి శ్రీను సినిమాలకు ముందు నుంచి అక్కడ ఆదరణ తక్కువే. అందులోనూ నాన్ బాలయ్య సినిమాలకు మరీ కష్టం. ‘వినయ విధేయ రామ’లో బోయపాటి చూపించిన అతికి యుఎస్ ఆడియన్స్ బెంబేలెత్తిపోయారు.
ప్రిమియర్స్ నుంచి దారుణమైన రిపోర్ట్ వచ్చింది.రివ్యూలు కూడా బాగా డ్యామేజ్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడే సమయానికే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. సినిమా అనుకున్నదానికంటే పెద్ద డిజాస్టర్ అయింది. ‘స్కంద’ ట్రైలర్ చూడగానే ఈ సినిమాకు యుఎస్ ప్రిమియర్స్ వేస్తే ఎలాంటి టాక్, రివ్యూలు వస్తాయో అందరికీ అర్థమైపోయింది. ప్రిమియర్స్ ద్వారా వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఫిక్సయి ఆ షోలు క్యాన్సిల్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యుఎస్‌లో సరైన బిజినెస్ కూడా జరగట్లేదని సమాచారం.
This post was last modified on September 1, 2023 10:16 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…