ఈ ఏడాది అత్యంత భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఏజెంట్ ని అఖిల్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. దీన్ని స్ట్రీమింగ్ చేయడానికి ఓటిటి సంస్థనే ముందు వెనుకా ఆడుతోందంటే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. నిర్మాత అనిల్ సుంకర పూర్తి స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేశామని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి బయట ఎక్కడా కనిపించలేదు. మీడియా ముందుకొచ్చినా గత ఫలితం గురించిన ప్రశ్నలే ఉంటాయి కాబట్టి సైలెంట్ గా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు దానికి సెలవు వచ్చేసింది.
ఇంతకు ముందే ఇచ్చిన కమిట్ మెంట్ కి కట్టుబడి పవన్ కళ్యాణ్ సినిమా సురేందర్ రెడ్డికే వచ్చింది. నిర్మాత రామ్ తాళ్ళూరి దీన్ని నిర్మించబోతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ప్రచారం జరిగినట్టు ఇది విక్రమ్ వేదా రీమేక్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిపిన ఆఫీస్ పూజా కార్యక్రమాల్లో రచయిత వక్కంతం వంశీ వచ్చాడు కాబట్టి అతనిచ్చిన కథే తెరకెక్కొచ్చు. వీళ్ళ కాంబినేషన్ లో కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ మంచి ర్యాపొ ఉంది. నిజానికీ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఫైనల్ గా ఇప్పుడు రూట్ క్లియరయ్యింది.
రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. పవన్ కళ్యాణ్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజిలు పూర్తి చేయాలి. ఆ తర్వాత హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వాలి. ఈ మూడు అయితే కానీ సూరి సెట్లో అడుగు పెట్టలేడు. సో ఇదంతా అవ్వడానికి అయిదారు నెలలు పట్టొచ్చు. ఎన్నికలు దగ్గరగా ఉన్న నేపథ్యంలో 2024 వేసవి కన్నా ముందు మొదలయ్యే ఛాన్స్ లేనట్టే. హీరోయిన్, ఇతర టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏజెంట్ గాయం మాన్పుకోవడానికి సురేందర్ రెడ్డికి ఇంతకన్నా గోల్డెన్ ఛాన్స్ దక్కదు. సరిగ్గా వాడుకుంటే అద్భుతమైన కంబ్యాక్ అవుతుంది
This post was last modified on September 1, 2023 9:56 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…