నిన్న సన్ పిక్చర్స్ అధినేత దయానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెక్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఎంత సొమ్ము ఉండొచ్చనే దాని మీద రకరకాల అంచనాలు వేసుకున్నారు కానీ పిక్ లో ఉన్నది సీల్డ్ కవర్ కావడంతో ఎవరూ ఖచ్చితంగా ఎంతనేది గెస్ చేయలేకపోయారు. అయితే అంతర్గతవర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే మాత్రం ఫిగర్ మతిపోయేలా ఉంది. చెక్కు మీద పేర్కొన్న మొత్తం అక్షరాలా వంద కోట్లని అంటున్నారు. పారితోషికం కాకుండా జైలర్ మీద లాభాల్లో వాటాగా దీన్ని అందించినట్టు తెలిసింది.
షూటింగ్ సమయంలో ఇచ్చిన రెమ్యునరేషన్ వంద కోట్లు కాకుండా ఇది అదనంగా ఇచ్చి ఉండొచ్చనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది. ఇది నిజమైతే ఇంత లేట్ ఏజ్ లో అంత మొత్తం అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ గా రజని కాంత్ కొత్త రికార్డు సృష్టించినట్టే. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రజిని, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందబోయే భారీ చిత్రానికి అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉండొచ్చనే టాక్ తిరుగుతోంది. చెక్కు మీద ఉన్న ఫిగర్ దయానిధి మారన్, రజని, ఆయన ఆడిటర్, బ్యాంక్ అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదు.
అయినా సరే ఏదో ఒక లీకు రూపంలో తెలిసే ఛాన్స్ లేకపోలేదు. జైలర్ ఇండస్ట్రీ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ త్వరలో కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాంలో స్పెషల్ క్యామియో రూపంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, శర్వానంద్, ఫహద్ ఫాసిల్ కాంబోలో నటించబోయే మల్టీస్టారర్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్నే మొదలుపెట్టారట. తగినంత విశ్రాంతి దొరకడంతో రజని త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతారని తెలిసింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో రెండు ప్రాజెక్టులు సైన్ చేయబోతున్నారు.
This post was last modified on September 1, 2023 11:16 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…