టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో గోపీచంద్ ఒకడు. తన సినిమాల రిలీజ్ టైంలో తప్ప అతను బయటెక్కడా కనిపించడు. ఇప్పటిదాకా ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా వివాదాస్పదంగా మాట్లాడింది లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గోపీకి చాలా మంచి పేరుంది. అతడికి సంబంధించి ఏ కాంట్రవర్శీ లేదు. అలాంటి హీరో మీద దర్శకుడు రవికుమార్ చౌదరి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. గోపీ పేరెత్తలేదు కానీ.. అతణ్ని ఉద్దేశించే రవికుమార్ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టం. రవికుమార్ డైరెక్ట్ చేసిన యజ్ఞం మూవీతోనే గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన మరో చిత్రం సౌఖ్యం డిజాస్టర్ అయింది. ఐతే యజ్ఞం సక్సెస్ తర్వాత గోపీ తనను పట్టించుకోలేదన్నట్లుగా రవికుమార్ మాట్లాడాడు.
ఒక రోజు ఆ హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమను అన్నాడు. ఒరేయ్ అంత బలిసిందా రా మీకు? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారు మందిని దాటుకుని రావాలా? విలన్‌గా నటించేవాడిని హీరోగా నేనే చేశాను. నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. తర్వాతి సినిమాకు వాడి పారితోషికం కన్నా నాదే ఎక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.
వాడు ఇప్పుడు ఎదురుపడినా నేను ఇలాగే మాట్లాడతా. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు ఈ రోజు పూర్తిగా మారిపోయాడు. రారాజు’ సినిమా షూటింగ్ కోఠిలో జరుగుతుంటే వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసి ఫ్లాప్‌లో ఉన్నాను. అప్పుడు మనిద్దరం కలిసి ఇంకో సినిమా చేద్దాం అంటే నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఆ సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు. నా దగ్గర ఆధారాలున్నాయి.
ఒక సినిమా హిట్ కాగానే అంత బలిసిపోయిందా? అంత ఈగో ఏంటి నీకు? చిరంజీవి, బాలకృష్ణ పవన్‌కల్యాణ్ కంటే గొప్పోడివా? నువ్వు. జీవితంలో వాళ్లు ఎన్నో రకాల సినిమాలు చేశారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మరి నువ్వేంటి అని రవికుమార్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం రవికుమార్ తిరగబడరా స్వామి అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో హీరోయిన్ మన్నారా చోప్రాను స్టేజ్ మీద రవికుమార్ ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
This post was last modified on September 1, 2023 11:14 am
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…