రెండేళ్లకో సినిమాతో వస్తున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇకపై పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన అప్ కమింగ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కి ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను మొదలు పెట్టాడు. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై మంచి బజ్ తెచ్చాడు నవీన్. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో సంతోషంగా లేడని, అందుకే దర్శకుడు మారాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలోనే ఈ దర్శకుడు ‘మ్యాడ్’ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా తీశాడు. ఆ సినిమా ఆగిపోయినందుకే నిర్మాత నాగ వంశీ అతనితో ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తకి మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఉందని మరో దర్శకుడి చేతిలో పెట్టేందుకు హీరో గట్టిగాట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కథ , కథనం పరంగా మొదటి దర్శకుడికి క్రెడిట్ ఇస్తారా ? లేదా చూడాలి. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి స్పీడుకి ఈ సినిమా మళ్ళీ గ్యాప్ ఇచ్చేలా ఉంది. దర్శకుడు సెట్ అవ్వాలి. మళ్ళీ రీ వర్క్ చేసుకోవాలి చాలా తతంగం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయబోయే దర్శకుడిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on September 1, 2023 12:51 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…