కొన్నేళ్ళ క్రితం శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ తో కమర్షియల్ మూవీస్ తీసి వరుస హిట్లు కొట్టాడు. ఇప్పటికీ శ్రీను వైట్ల కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వీడియోస్ , మీమ్స్ లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన ప్రీవీయస్ మూవీస్ పెద్దగా ఆడలేదు. వరుస ఫ్లాప్స్ , పైగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ శ్రీను వైట్లను కుదేలు చేసేసింది. ఈ నేపథ్యంలో విష్ణు మంచుతో ‘డీ’ కి సీక్వెల్ ప్లాన్ చేసుకున్న శ్రీను వైట్ల కి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం మరింత నిరాశ పరిచింది.
తాజాగా గోపీచంద్ కి ఒక కథ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు వైట్ల. ఈ సినిమా లొకేషన్ స్కవుటింగ్ కోసం శ్రీను వైట్ల టీంతో వెళ్లారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. దీని కోసం శ్రీను వైట్ల ది బెస్ట్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. ఈ నెల 9న ఈ కాంబో సినిమా హైదరాబాద్ లో లాంచ్ కానుంది. ఇరవై తర్వాత ఇటలీలో రెగ్యులర్ ఘాట్ మొదలవుతుంది.
అక్కడ మేజర్ సీన్స్ , యాక్షన్ తీసుకొని వచ్చాక హైదరాబాద్లో నెక్స్ట్ షెడ్యూల్ ఉండబోతుంది. ప్రస్తుతం గోపీచంద్ కూడా హిట్ ట్రాక్ లో లేడు. తాజాగా ‘రామబాణం’ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచి డిజాస్టర్ అనిపించుకుంది. మరి ఇటు శ్రీను వైట్ల కి అటు గోపీచంద్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. మరి వైట్ల మునుపటిలా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
This post was last modified on August 31, 2023 11:03 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…