వచ్చే వారం సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న జవాన్ కోసం నిన్న చెన్నై శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. పేరుకు హిందీ సినిమానే కానీ ఏదో స్ట్రెయిట్ కోలీవుడ్ మూవీ అన్నంత హంగామా జరిగింది. క్యాస్ట్ అండ్ క్రూతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై మొదటిసారి ఇంత పెద్ద ఈవెంట్ కు వచ్చిన బాద్షాకు ఘన స్వాగతం చెప్పారు. ఇలాంటి వేడుకల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచే సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ మరోసారి తన లైవ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. షారుఖ్ మాటలు, చేతలు రెండూ ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎడిటర్ మాట్లాడుతూ జవాన్ కు సంబంధించిన రన్ టైంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే తన పాత్రను తగ్గించమని, అంతే తప్ప విపరీతంగా కష్టపడ్డ ఇతర ఆర్టిస్టుల భాగాలను కోతకు గురి చేయొద్దని చెప్పాడట. ఇక షారుఖ్ స్పీచులో చాల చమక్కులు తలెత్తాయి. యోగిబాబు గురించి ప్రస్తావిస్తూ ఒకచోట ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన జనం తన గురించని ఫీలయ్యానని, తీరా చూస్తే వాళ్లంతా ఈ హాస్య నటుడి కోసమని గుర్తించి షాక్ తిన్నానని చెప్పి నవ్వులు పూయించాడు. దెబ్బకు యోగిబాబు ఆశ్చర్యపోతూ లేచి నిలబడి షారుఖ్ కి దండం పెట్టేశాడు.
ఇదొక్కటే కాదు అనిరుద్ ని తనకు కొడుకు లాంటి వాడని చెప్పిన షారుఖ్ అతనితో కలిసి స్టేజి మీద డాన్సు చేయడం ఓ రేంజ్ లో పేలింది. నయనతార, విజయ్ సేతుపతి, దర్శకుడు ఆట్లీ మీద ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. మాట్లాడింది ఇంగ్లీష్ లోనే అయినా మధ్యలో యాంకర్ సహాయంతో జవాన్ టీమ్ సభ్యులకు తమిళ బిరుదులు ఇవ్వడం ఆకట్టుకుంది. ఇవాళే ట్రైలర్ ఆన్ లైన్ లో రానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతున్న జవాన్ మీద మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. లేటెస్ట్ సెన్సేషన్ గదర్ 2ని దాటాల్సిన టార్గెట్ తో పెద్ద ఎత్తున బరిలో దిగుతోంది.
This post was last modified on August 31, 2023 5:35 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…