షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చూస్తున్నాం. ప్యాన్ ఇండియా రేంజ్ లో స్వయంగా ఆయనే నిర్మాతగా మారి తమిళ దర్శకుడు ఆట్లీ మీద మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన ధైర్యానికి సమాధానం సెప్టెంబర్ 7న దొరకనుంది. ఇంతకు ముందు ప్రీ వ్యూ పేరుతో వదిలిన సుదీర్ఘమైన టీజర్ లో కథేంటో ఎక్కువగా గుట్టు విప్పని టీమ్ ఇప్పుడో కొత్త ట్రైలర్ తో పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. స్టోరీ తాలూకు తీరుతెన్నులతో పాటు ఎంత భారీ యాక్షన్ గ్రాండియర్ గా ఇది రూపొందిందో చూపించేశారు. హంగామా మాములుగా అయితే లేదు.
దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే జవాన్(షారుఖ్ ఖాన్) తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు తీసేందుకు వెనుకాడని ఒక ఆయుధాల స్మగ్లర్ (విజయ్ సేతుపతి) తో తలపడతాడు. అయితే ఈ క్రమంతో తన విలువైన జీవితాన్ని కోల్పోయి అజ్ఞాతంలోకి వెళ్తాడు. ఈలోగా వారసుడు(షారుఖ్ ఖాన్) పెద్దవాడై పోలీస్ ఆఫీసర్ గా మారతాడు. తిరిగి వచ్చిన జవాన్ రాగానే ఒక మెట్రో ట్రైన్ ని హైజాక్ చేసి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు వినిపిస్తాడు. అది తన సామ్రాజ్యన్ని కూలుస్తుందని గుర్తించిన స్మగ్లర్ కొత్త యుద్ధం మొదలుపెడతాడు. తండ్రి కొడుకులు కలిసి శత్రుసంహారం చేయడమే అసలు పాయింట్.
దర్శకుడు అట్లీ విజువల్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ క్లారిటీని ఇచ్చేశారు. దీపికా పదుకునే ఫ్లాష్ బ్యాక్ కు పరిమితం కాగా నయనతార ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా పవర్ ఫుల్ పాత్ర దక్కించుకుంది. యోగిబాబు కామెడీని ఇందులో కూడా వదల్లేదు. అనిరుద్ రవిచందర్ నేపధ్య సంగీతం సీన్స్ ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. షారుఖ్, విజయ్ సేతుపతి ఇద్దరూ వయసు మళ్ళిన పాత్రల్లో కనిపించడం ఫైనల్ ట్విస్ట్. మొత్తానికి జవాన్ ద్వారా ఒక భారీ గ్రాండియర్ చూడబోతున్నామనే హామీ అయితే ఇచ్చేశారు
This post was last modified on August 31, 2023 1:19 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…