సక్సెస్ రేట్, కలెక్షన్ల రేంజ్ పరంగా చూస్తే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకడు. కానీ ఆయనకు మొదట్నుంచి యుఎస్‌లో పెద్దగా మార్కెట్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల సినిమాలు అంటే.. హీరో ఎవరన్నది పట్టించుకోకుండా మినిమం 2 మిలియన్ డాలర్ల రేటు ఇచ్చేస్తారు. కానీ బోయపాటి తీసే ఊర మాస్ సినిమాలకు అక్కడ పెద్దగా డిమాండ్ ఉండదు. మిలియన్ డాలర్ల రేటు పలకడం కూడా కష్టమే.
నందమూరి బాలకృష్ణతో బోయపాటి తీసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే అయినప్పటికీ.. వాటికి కూడా ఓవర్సీస్‌లో పెద్దగా డిమాండ్ కనిపించలేదు. ‘అఖండ’ ఓవర్సీస్‌లో కూడా బాగా ఆడినా సరే.. బోయపాటి కొత్త చిత్రం ‘స్కంద’కు మాత్రం అక్కడ క్రేజ్ రాలేదు. అందులోనూ ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ చూశాక ఈ సినిమాపై యుఎస్ ఆడియన్స్ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి మైండ్ లెస్ మాస్ వాళ్లకు రుచించదు. ‘స్కంద’కు గతంలో మంచి రేటే వచ్చినా.. నిర్మాత ఇంత కావాలి అని పట్టుబట్టి ఆ రేటు కోసమే ఎదురు చూశాడట.
కానీ ఇంతకుముందు బయ్యర్లు ఆఫర్ చేసిన రేటు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదట. రిలీజ్ దగ్గర పడుతుండగా.. సినిమాకు ఓవర్సీస్‌లో బిజినెస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రేటుకు సినిమాను అమ్మిన నిర్మాత.. ఓవర్సీస్ రైట్స్ అమ్మడం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్‌లో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. ఓపెనింగ్స్ మీద ఆధారపడే సినిమాను కొనే బయ్యర్లు ఈ సినిమా మీద నిర్మాతలు అడిగినంత రేటు పెట్టడం చాలా రిస్క్ అని వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 31, 2023 11:09 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…