సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తన సోదరి హారిక సూర్యదేవరని ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తున్న మ్యాడ్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా లాంచవుతున్నాడు. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ తో పాటు రామ్ నితిన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ కాలేజీ డ్రామా టీజర్ ని ఇందాకా రిలీజ్ చేశారు. దీని షూటింగ్ ని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసి ఫైనల్ కాపీ సిద్ధం చేశారు. రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు కానీ మ్యాడ్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చిన్న వీడియో ద్వారా చేశారు.
అదో పేరున్న ఇంజనీరింగ్ కాలేజీ. దానికి అనుబంధంగా ఓ హాస్టల్. నిత్యం కుర్రాళ్ళ అల్లరితో మహా గోలగా ఉంటుంది. అన్ని వసతులు ఉన్నా ర్యాగింగ్ మాత్రం దూరంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో దాన్ని తీసుకొస్తారు ముగ్గురు కుర్రాళ్ళు. విపరీతమైన సందడి మొదలవుతుంది. క్యాంటీన్ కు సంబంధించిన గొడవలు మొదలవుతాయి. సరదాగా సాగిపోయే పిల్లల మధ్య అపార్థాలు, అల్లర్లు కలకలం రేపుతాయి. అయితే హింసకు దూరంగా ఉండే ఇలాంటి కాలేజీలో ఆ యువకులు సాధించాలనుకున్నది ఏంటి, చివరికి వీళ్ళ ప్రయాణం ఎక్కడికి చేరుకుందనే పాయింట్ తో రూపొందించారు.
ఆద్యంతం యూత్ ని టార్గెట్ చేసుకున్న మ్యాడ్ లో అర్ధమయ్యీ కానట్టు ఉండే బోల్డ్ జోక్స్ ని గట్టిగానే దట్టించారు. సహజంగా కళాశాలల్లో ఉండే పరిస్థితులను ఇందులో చూపించారు. భీమ్స్ సిసిరిరోలియో సంగీతం అందించిన మ్యాడ్ లో గౌరీ ప్రియా, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. ప్రొడక్షన్ వేల్యూస్ గట్రా సబ్జెక్టుకి తగ్గట్టే కనిపిస్తున్నాయి. రౌడీ బాయ్స్, బాయ్స్ హాస్టల్ తరహాలో అనిపిస్తున్నా వాటి కన్నా బెటర్ ఫన్ ఈ మ్యాడ్ లో జొప్పించినట్టు తెలుస్తోంది. యువతను మెప్పిస్తే చాలు హిట్టు గ్యారెంటీ అనే ట్రెండ్ లో ఇది ఎలా నెగ్గుకొస్తుందో విడుదలయ్యాక చూడాలి
This post was last modified on %s = human-readable time difference 10:57 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…