తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ‘ఇంద్ర’ ఒకటి. 2002 సమయానికి తెలుగు సినిమాల్లో రూ.20 కోట్ల షేర్ మార్కు కూడా ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఆ చిత్రం ఆ రోజుల్లోనే ‘ఇంద్ర’ రూ.28 కోట్ల దాకా షేర్ సాధించి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. చిరంజీవితో అప్పటికే ‘జగదేకవీరుడు’, ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ చిత్రంతో మరింత పెద్ద విజయాన్నందుకున్నారు.
ఊహించని స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం గురించి.. దాని క్రేజ్ గురించి తాజాగా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంద్ర’ సినిమా థియేటర్ల దగ్గర జన సందోహం చూసి కంగారు పడ్డ పోలీసు ఉన్నతాధికారులు.. చిరంజీవికి నేరుగా ఫోన్ చేసి అభిమానులను కొంచెం కంట్రోల్ చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘‘చిరంజీవితో నేను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లి 25 వారాల పాటు ఆడింది. ఆ తర్వాత మా కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ కూడా బాగా ఆడింది. ఐతే ‘ఇంద్ర’ పరిస్థితి వేరు. నెమ్మదిగా పుంజుకోవడం లాంటిదేమీ లేదు. తొలి రోజు ఉదయం నుంచే అది పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఆ సినిమా థియేటర్ల దగ్గర జనం, చిరంజీవి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారంటే చాలామంది పోలీస్ కమిషనర్లు భయపడి నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేశారు.
ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని.. టికెట్ల కోసం గొడవలు జరుగుతాయని.. కాబట్టి అభిమానులు కొంచెం కుదురుగా ఉండాలని. పోలీసులకు సహకరించాలని.. వారిని మీరే ఒక మాట చెప్పి కంట్రోల్ చేయాలని చెప్పారు. ముందుగా విజయవాడ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేశారు’’ అని అప్పటి యుఫోరియాను గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.
This post was last modified on August 31, 2023 10:37 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…