పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పసందైన విందు అంది చాలా కాలం అయిపోయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ నుంచి సంతృప్తికర చిత్రం ఏదీ రాలేదు. 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన చివరి చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. రీఎంట్రీ తర్వాత చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ ఓ మోస్తరుగా ఆడగా.. ‘బ్రో’ ఫ్లాప్ అయింది. ఈ మూడూ రీమేక్ సినిమాలు కావడం అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించాయి.
పవన్ స్థాయికి.. ఆయన చేస్తున్న సినిమాలకు పొంతన ఉండట్లేదని.. ఒక పవర్ ఫుల్ స్ట్రెయిట్ మూవీలో పవన్ నటిస్తే బాక్సాఫీస్ మోత మామూలుగా ఉండదని.. తన ముందు ఎవ్వరూ నిలవలేరని అభిమానులు ఆవేదన చెందుతుంటారు సామాజిక మాధ్యమాల్లో. యువ దర్శకుడు సుజీత్‌తో పవన్ చేస్తున్న ‘ఓజీ’ అలాంటి సినిమానే అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమా హఠాత్తుగా సెట్స్ మీదికి వెళ్లి.. చకచకా కొన్ని షెడ్యూళ్లు షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. కొన్ని వారాల కిందటే ఈ విషయాన్ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇక పవన్ పుట్టిన రోజు రాబోయే టీజర్ మీద అంచనాలైతే మామూలుగా లేవు. ఈ టీజర్ గురించి సినిమా యూనిట్ నుంచి కొన్ని ఎగ్జైటింగ్ హింట్స్ బయటికి వస్తున్నాయి. టీజర్లో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్.. విజువల్స్.. డైలాగ్స్.. ఎలివేషన్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ ఒక రేంజిలో ఉంటాయంటున్నారు.
చివర్లో పవన్ పూర్తిగా రక్తం అంటుకున్న చేతితో గన్ను పట్టుకుని ఒక స్మైల్‌తో డైలాగ్ చెబుతాడని.. అది చూసి అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని ఒక ప్రచారం నడుస్తోంది. టీజర్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పవన్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఒక టీజర్ రిలీజ్ కావడానికి ముందు ఇంత చర్చ జరగడం.. ఇంత హైప్ క్రియేట్ కావడం అరుదైన విషయం. మరి నిజంగా టీజర్ అంచనాలకు తగ్గట్లే ఉండి అభిమానులను ఉర్రూతలూగిస్తుందేమో చూడాలి.
This post was last modified on August 30, 2023 7:47 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…