గత ఏడాది డీజే టిల్లు రూపంలో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆశలన్నీ టిల్లు స్క్వేర్ మీదే ఉన్నాయి. దర్శకుడు, హీరోయిన్ మారాల్సి వచ్చినా సరే తగ్గేదేలే అనుకుంటూ తాను అనుకున్నదే చేస్తున్నాడు. స్క్రిప్ట్ పనులు, షూటింగు కలిపి ఇప్పటికే ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. అక్టోబర్ రిలీజ్ అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా వచ్చేది లేనిది యూనిట్ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతోంది. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లిరికల్ పాట జనంలోకి బాగానే వెళ్ళింది కానీ మొదటి భాగం టైటిల్ సాంగ్ తెచ్చినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయిన మాట వాస్తవం.
ఇక అసలు విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణకు సంబంధించిన ఫుటేజ్ పట్ల సిద్దు పూర్తి సంతృప్తిగా లేడట. కొంత భాగం రీ షూట్ చేయాల్సి రావొచ్చని దర్శకుడు మల్లిక్ రామ్ తో అన్నట్టుగా వచ్చిన లీక్ కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆల్రెడీ సితార సంస్థ దీని మీద పెద్ద బడ్జెట్ పెడుతోంది. కంటెంట్ మీద నమ్మకం, యూత్ లో టిల్లు బ్రాండ్ కున్న ఫాలోయింగ్ ని ఆధారంగా చేసుకుని అనుపమ పరమేశ్వరన్ ని ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ స్టేజిలో మార్పులు చేర్పులు అంటే మళ్ళీ కొత్త భారం పడుతుంది.
ఇది నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా ప్రస్తుతానికి బ్రేక్ పడిన మాట వాస్తవమేనని ఇన్ సైడ్ టాక్. సిద్దు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేందుకు సిద్ధంగా లేడు. ఒకవేళ రిస్క్ అనిపిస్తే ప్రాజెక్టులు పెండింగ్ పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. నందిని రెడ్డితో చేయాల్సిన సినిమాని హోల్డ్ లో ఉంచేసి బొమ్మరిల్లు భాస్కర్ తో ఇటీవలే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. టిల్లు ద్వారా ఏర్పడ్డ మార్కెట్ ని కాపాడుకోవడానికి సిద్దులో హీరో కం రచయిత మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతోంది. అందుకే డైరెక్టర్లు సైతం గట్టిగా చెప్పలేని సిచువేషన్ ఉందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
This post was last modified on August 30, 2023 7:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…