సెప్టెంబరు నెలలో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అని.. ఈ నెల ఆరంభంలో, చివర్లో రిలీజ్ కానున్న రెండు చిత్రాలు గట్టిగా సంకేతాలు ఇస్తున్నాయి. తొలి వారంలో రాబోతున్న షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’కు మంచి హైప్ ఉంది. నార్త్ ఇండియాలో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. ఇక నెల చివర్లో వచ్చే ‘సలార్’ అయితే మొత్తం ఇండియానే షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమా నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తేనే హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ట్రైలర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టులోనే ట్రైలర్ లాంచ్ అన్నారు కానీ.. అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 6న ‘సలార్’ ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
విడుదలకు 22 రోజుల ముందే ‘సలార్’ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ముందు 7వ తారీఖున ట్రైలర్ లాంచ్ అనుకున్నారు కానీ.. ఆ రోజున ‘జవాన్’ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఫోకస్ ‘సలార్’ మీద ఉండదని ఒక రోజు ముందుకు జరిపారు. ఆ రోజు సోషల్ మీడియాను షేక్ చేశాక ‘సలార్’ ట్రైలర్ తర్వాతి రోజు థియేటర్లలోకి కూడా వస్తుందని సమాచారం. ‘జవాన్’ సినిమాతో ఈ ట్రైలర్‌ను ఎటాచ్ చేయనున్నారట.
ఇంటర్వెల్లో ట్రైలర్‌ను ప్రదర్శిస్తారట. ట్రైలర్ బాగుంటే జవాన్ థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయం. సెప్టెంబరు 28న ‘సలార్’ వరల్డ్ వైడ్ రికార్డు స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ చివరి మూడు చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ మాస్ మూవీ కావడం, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన చిత్రం కావడంతో ‘సలార్’ మీద అంచనాలు మామూలుగా లేవు. ‘కేజీఎఫ్’ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.
This post was last modified on August 30, 2023 4:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…