ఎన్ని కోట్లయినా పర్వాలేదు ఒక సంగీత దర్శకుడి కోసం నిర్మాతలు ఎగబడుతున్నారంటే అది ఒక్క అనిరుద్ రవిచందర్ విషయంలోనే జరుగుతోందన్న మాట వాస్తవం. జైలర్ వచ్చాక ఇతని రేంజ్ ఇంకా ఎగబాకింది. కావాలయ్యా సాంగ్ పిచ్చ వైరల్ కావడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోవడంతో మనోడి డిమాండ్ అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అయితే జవాన్ విషయంలో మాత్రం మ్యూజిక్ ఆశించిన స్థాయిలో రీచ్ లేకపోవడం అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా బాద్షా ఫ్యాన్స్ మనోడి మీద కాస్త ఘాటుగానే ఫైర్ అవుతున్నారు.
జవాన్ నుంచి ఇప్పటిదాకా నాలుగు ఆడియో ట్రాక్స్ వచ్చాయి. జిందా బందా, చలేయా, నాట్ రామయ్య వస్తావయ్యాతో పాటు ప్రీవ్యూ థీమ్ ని రిలీజ్ చేశారు. వింటుంటే ఏదో హడావిడిగా నడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతోందే తప్ప ఛార్ట్ బస్టర్ అనిపించేలా ట్యూన్స్ లేవని ఆన్ లైన్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ విడుదలకు ముందే రెండు ట్రాక్స్ జనంలోకి బాగా చొచ్చుకువెళ్లాయి. కానీ జవాన్ కు అలా జరగడం లేదనే ఫ్యాన్స్ బాధ. ఒకవేళ స్క్రీన్ మీద చూశాక అభిప్రాయాలు మారతాయేమో చెప్పలేం కానీ అమాంతం శెభాష్ అనిపించే రేంజ్ లో అయితే ఉండకపోవచ్చు.
తమిళంలో ఎక్స్ ట్రాడినరీ స్కోర్స్ ఇచ్చే అనిరుద్ ఇతర భాషల్లోనే తడబడటం ఇక్కడ గమనించవచ్చు. తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ కి కంపోజ్ చేసినప్పుడు కూడా ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్స్ ఇవ్వలేదు. మొత్తం కలిపి రెండు మూడు క్లిక్ అయ్యాయి అంతే. చేతిలో జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 13 ఉన్నాయి. వీటికి ఇంకా పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. సిట్టింగ్స్ కోసం దర్శకులు ఎదురు చూస్తున్నారు. అనిరుద్ ఊపిరి సలపని షెడ్యూల్స్ లో వీలైనంత క్వాలిటీ టైం ఇస్తే బాగుంటుంది. జవాన్ లాగా షాకులు ఇవ్వకుంటే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిజమేగా.
This post was last modified on August 30, 2023 1:10 am
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…