ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చాక ప్రతి ప్రేక్షకుడు ఫేస్ బుక్, ట్విట్టర్లో రివ్యూలు చెప్పేస్తున్నారు కానీ ఒకప్పుడు వారం తర్వాత పత్రికలు మాత్రమే సినిమాల గురించిన మంచి చెడ్డలు చెప్పేవి. కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి కాబట్టి వాటికి లోబడాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయిపోయి ఎక్కువ స్పందించినా చిత్ర విచిత్ర పరిణామాలు జరిగిపోతాయి. ఆ మధ్య మేం ఫేమస్ విషయంలో జరిగిన పంచాయితీ మీడియాతో పాటు అందరికీ గుర్తున్నదే. నెగటివ్ కామెంట్లను డిఫెండ్ చేసుకోవడానికి ఆ నిర్మాతలు చాలా ఆర్గుమెంట్స్ చేశారు కానీ ఫైనల్ గా బొమ్మ ఓ మోస్తరుగానే ఆడింది.
తాజాగా అదే బ్యానర్ నుంచి వచ్చిన బాయ్స్ హాస్టల్ కు పబ్లిసిటీ గట్రా గట్టిగానే చేశారు కానీ ఆశించిన భారీ స్థాయిలో థియేటర్స్ నుంచి స్పందన లేదు. ఏ సెంటర్స్ లో మంచి కలెక్షన్లు కనిపిస్తున్నా అవి పెద్ద నెంబర్లుగా మారడం లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదో రివ్యూ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ఛాయ్ బిస్కెట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన శరత్ చంద్ర ట్విట్టర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. అసలేం జరిగిందనే దాని మీద పక్కా వివరాలు, ఆధారాలు లేకపోయినా నెటిజెన్లతో పాటు మీడియాలోనూ హాట్ డిస్కషన్స్ జరిగాయి.
ఇవాళ బాయ్స్ హాస్టల్ సక్సెస్ మీట్ చేశారు. ఈ నెగటివిటీకి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు సమర్పకుల్లో ఒకరైన అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున సుప్రియ ఆ ఇష్యూ మీద ఎక్కువ చర్చ రానివ్వకుండా మేనేజ్ చేయడంతో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏది ఎలా ఉన్నా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు కూడా బాలేవని అన్నవాళ్లున్నారు. వాటిని వ్యక్తిగత అభిప్రాయాల కిందే చూడాలి. అంతే తప్ప నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు దానికి బదులు చెప్పాలనే వాదం ఒరిజినల్ ఐడిలు లేని నెట్ ప్రపంచంలో సాధ్యం కాదు. సో నెగటివ్ అయినా పాజిటివ్ అయినా సమానంగా తీసుకుంటేనే ఏ సమస్యలూ రావు.
This post was last modified on August 29, 2023 8:11 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…