సరిగ్గా నెల రోజుల్లో విడుదల కాబోతున్న మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీ సలార్ ట్రైలర్ కోసం అభిమానులే కాదు సగటు ఆడియన్స్ కూడా విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 3 ట్రైలర్ రావొచ్చనే సంకేతాలు బలంగా ఉన్నాయి. అయితే టీజర్ లో ఎక్కడా స్టోరీని రివీల్ చేయని నేపథ్యంలో కథకు సంబంధించిన లీకుల కోసం అభిమానులు వెతుక్కోవడం సోషల్ మీడియా ట్రెండ్స్ లో గమనించవచ్చు. హీరో సంగతి తర్వాత ముచ్చటించుకోవచ్చు కానీ విలన్లకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ మాత్రం మాంచి ఇంటరెస్టింగ్ గా ఉంది. అదేంటో చూద్దాం.
సలార్ లో ఇద్దరు విలన్లన్న సంగతి తెలిసిందే. జగపతిబాబుది తండ్రి పాత్ర. పేరు రాజ మన్నార్. కొడుకు పృథ్విరాజ్ సుకుమారన్ కు వరదరాజ మన్నార్ గా నామకరణం చేశారు. మొదటి భాగం సీజ్ ఫైర్ ఫస్ట్ హాఫ్ లో ముప్పాతిక శాతం ఎక్కువ స్క్రీన్ స్పేస్ పృథ్విరాజ్ కే దక్కిందట. ప్రభాస్ ని చూపించీ చూపించనట్టు చేసి ఉన్నాడని ఫీలయ్యేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే రాసుకున్నారట. ప్రీ ఇంటర్వెల్ కు ముందు డార్లింగ్ ని ఒక భారీ స్థాయి యాక్షన్ ఎపిసోడ్ తో హై లెవెల్ ఇంట్రోతో మైండ్ బ్లాంక్ చేస్తారట. ఏదైనా కొంత అసంతృప్తి ఉంటే అదంతా మాయం చేసేలా డిజైన్ చేశారట.
అక్కడి నుంచి సలార్, వరదరాజులుకు మధ్య ఫేస్ టు ఫేస్ యుద్ధంతో తెరలు హోరెత్తిపోవడం ఖాయం. మరో ట్విస్టు ఏంటంటే జగపతిబాబు కేవలం కొంత భాగానికే పరిమితమవుతాడట. పార్ట్ 2లో ఫాదర్ ప్రభాస్ కు ఈయనకు మధ్య జరిగే వార్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఊరిస్తున్నారు. ఇది ఇంకా షూటింగ్ జరగలేదని వినికిడి. సో ఒకరకంగా ప్రశాంత్ నీల్ ఇక్కడ బాహుబలి ఫార్ములానే వాడాడు. కాకపోతే రాజమౌళి ఇద్దరు ప్రభాస్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించలేదు,. సలార్ లో సాధ్యం చేయబోతున్నారు. ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూసి ట్రేడ్ మతులు పోతున్నాయి.
This post was last modified on August 29, 2023 7:57 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…