ఓన్లీ తెలుగు కంటెంట్ నినాదంతో సాగుతున్న ఆహా ఓటిటికి ఆ మధ్య కొంచెం గ్యాప్ వచ్చి స్పీడ్ తగ్గింది కానీ ఈ సీజన్ లో వచ్చిన రెండు పెద్ద బ్లాక్ బస్టర్లు బేబీ, సామజవరగమన రెండూ దానికే దక్కడంతో మళ్ళీ ఊపందుకుంది. దీన్ని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో సినిమాలతో పాటు టాక్ షోల మీద కూడా సీరియస్ ఫోకస్ పెట్టింది. గతంలో సమంతా హోస్ట్ గా సామ్ జామ్ ప్రోగ్రాంని బాగానే నడిపించిన తీరు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. చిరంజీవి, బన్నీ, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి ఎందరో సెలబ్రిటీలు ఆ షోకు గెస్టులుగా వచ్చి వినోదంతో మెప్పించారు.
బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడూ చూడని సరికొత్త యాంకర్ కోణంలో ఆయన్ను ఆవిష్కరించిన తీరు బ్లాక్ బస్టర్స్ ఎపిసోడ్స్ తెచ్చి పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో చేసినవి ఏ రేంజ్ లో పేలాయో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ఫామ్ ని కొనసాగించేందుకు ఆహా తాజాగా విశ్వక్ సేన్ ని తీసుకొచ్చి ఫ్యామిలీ ధమాకా అనే గేమ్ షో షురూ చేయబోతోంది. ఇప్పటికే కొన్ని భాగాల షూటింగ్ అయిపోతుంది. సామాన్య కుటుంబాలతో పాటు పరిశ్రమ ప్రముఖుల ఫామిలీస్ ని ఇందులో భాగం చేశారు.
ట్రైలర్ గట్రా చూస్తుంటే ఫన్నీగా, ఆసక్తికరంగా అనిపిస్తోంది. విశ్వక్ సేన్ కొత్త ఎనర్జీతో షోని నడిపించిన తీరు కనెక్ట్ అయ్యేలానే ఉంది. ఈ మధ్య స్టార్ హీరోలు టీవీ షోల మీద మక్కువ చూపించడం ఊపందుకునేలా ఉంది. గతంలో నాని, జూనియర్ ఎన్టీఆర్ లు బిగ్ బాస్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఆ తర్వాత నాగార్జున కొనసాగిస్తున్నారు. రానా, మంచు లక్ష్మిలు ఎప్పటి నుంచో ఇవి చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు విశ్వక్ కూడా అదే బాటలో పడ్డాడు. సినిమాల కంటే ఎక్కువగా రియాలిటీ షోల మీద దృష్టి పెడుతున్న ఆహాకు ఈ ఫ్యామిలి ధమాకా ఎలాంటి మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.
This post was last modified on August 29, 2023 4:29 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…