ఆగస్టు నెల మీద టాలీవుడ్ పెట్టుకున్న ఆశలు ఏమాత్రం నిలబడలేదు. ముందు నెలల్లో బేబి, సామజవరగమన లాంటి చిన్న సినిమాలు మంచి వసూళ్లు సాధించి ఆగస్టు మీద ఆశలు రేపగా.. ఈ నెల నిరాశనే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ టాలీవుడ్‌కు మామూలు షాకివ్వలేదు. చిరు కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నెలలో అనువాద చిత్రం ‘జైలర్’ వసూళ్ల పంట పండించుకుంది. కానీ దాని ముందు ‘భోళా శంకర్’ ఏమాత్రం నిలవలేకపోయింది.
ఇదే నెలలో వచ్చిన మరో మెగా హీరో సినిమా ‘గాండీవధారి అర్జున’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఉస్తాద్, ప్రేమ్ కుమార్, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిన్న సినిమాలూ నిరాశపరిచాయి. నెల చివరి వారంలో వచ్చిన ‘బెదురులంక 2012’ పర్వాలేదనిపించింది. మొత్తంగా ఆగస్టు నెల సెప్టెంబరుకు నిరాశనే మిగిల్చింది.
ఐతే తర్వాతి నెల సెప్టెంబరులో మాత్రం బాక్సాఫీస్ కళకళలాడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల ‘ఖుషి’ లాంటి క్రేజీ మూవీతో మొదలు కాబోతోంది. ఈ సినిమా వీకెండ్‌కు థియేటర్లలో సందడి తీసుకురావడం గ్యారెంటీ. టాక్ బాగుంటే సినిమా పెద్ద హిట్టవడం ఖాయం. తర్వాతి వారంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అదే వీకెండ్లో డబ్బింగ్ మూవీ ‘జవాన్’ కూడా బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంది. నెల మధ్యలో మరో అనువాద చిత్రం ‘చంద్రముఖి-2’ సందడి చేస్తుంది.
అదే సమయంలో రిలీజయ్యే ‘స్కంద’ మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా మాస్‌కు మంచి విందుగా భావిస్తున్నారు. ఇక నెల చివర్లో డైనోసర్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న ‘సలార్’కు ఉన్న హైప్ అలాంటిలాంటిది కాదు. నెల మొత్తం సందడి ఖాయంగా కనిపిస్తుండగా.. చివర్లో అయితే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. అందుకే సెప్టెంబరు కోసం ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on August 29, 2023 8:02 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…