స్టేజ్ మీద కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమను తాము నియంత్రించుకోలేక విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. మాటలతో పాటు చేతలు కూడా తడబడుతుంటాయి. ప్రవర్తన హద్దులు దాటిపోతుంటుంది. చాలా ఏళ్ల కిందట హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని ముద్దాడటమే కాక ఘాటు రొమాన్స్ చేయాలని చూడటం ఎంత దుమారం రేపిందో తెలిసిందే.
టాలీవుడ్ విషయానికి వస్తే కొన్నేళ్ల కిందట ఒక సినిమా వేడుకలో సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ముద్దివ్వడం తీవ్ర వివాదాస్పదం అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ‘యజ్ఞం’ ఫేమ్ రవికుమార్ చౌదరి.. తన కొత్త చిత్రం ‘తిరగబడరా సామి’కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో హద్దులు దాటి ప్రవర్తించాడు.
ఈవెంట్ చివర్లో స్టేజ్ మీద ఫొటోలకు పోజులిస్తూ ముందుగా అతను హీరోయిన్ మన్నారా చోప్రా మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని క్షణాలకే ఆమె బుగ్గ మీద ముద్దు కూడా పెట్టేశాడు. ఆ సమయంలో మన్నారా ఇబ్బంది పడుతూనే.. పైకి మాత్రం నవ్వేసింది. ఒక దర్శకుడు అంటే ఎవ్వరైనా ఉన్నత స్థాయిలో ఊహించుకుంటారు. అలాంటి వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేక కథానాయికకు ముద్దు పెట్టడం తీవ్ర అభ్యంతరకరంగా అనిపిస్తోంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేరే ఇండస్ట్రీల వాళ్లు ఈ వీడియో పట్టుకుని టాలీవుడ్ పేరెత్తి విమర్శలు చేస్తున్నారు. ‘యజ్ఞం’ సినిమా తర్వాత చాలా ఏళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్న రవికుమార్ చౌదరి ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కానీ తర్వాత మళ్లీ ట్రాక్ తప్పాడు. కొన్నేళ్లు కనిపించకుండా పోయిన అతను.. రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ తీశాడు. మీడియా దృష్టిలో పడటానికి, ఈ సినిమాకు పబ్లిసిటీ తేవడానికేమైనా ఇలా చేశాడేమో తెలియదు కానీ.. రవికుమార్ మీద సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on August 29, 2023 1:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…