ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందనే అంచనాలు ‘సలార్’ మీద ఉన్నాయి. ఇది సగటు మాస్ సినిమాలాగే కనిపిస్తున్నప్పటికీ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ కాన్వాస్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. అందుక్కారణం.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ మాస్ మసాలా సినిమా కావడం, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని డైరెక్ట్ చేస్తుండటమే.
కొన్ని నెలల కిందట హీరోను డైనోసర్‌తో పోలుస్తూ సాగిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ రిలీజ్ చేయకపోయినా.. సినిమాకు హైప్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఐతే రిలీజ్‌కు నెల రోజుల ముందు వరకు కూడా ఈ చిత్రానికి బిజినెస్ పూర్తి కాకపోవడంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అలా అని ‘సలార్’కు బయ్యర్లు లేక కాదు.
‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర ఊహించని నంబర్స్ నమోదు చేస్తుందని నమ్ముతున్న నిర్మాతలు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లు అడుగుతున్నారు. బయ్యర్లు కొంచెం తగ్గించి కోట్ చేస్తున్నారు. ఇలా చర్చోప చర్చలు జరుగుతూ బిజినెస్ కొంత ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం ‘సలార్’ నైజాం డీల్ పూర్తయినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా రూ.65 కోట్లు పెట్టి ‘సలార్’ నైజాం రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఇది మరీ ఎక్కువ రేటేమో అన్న డిస్కషన్ నడుస్తోంది.
కానీ ఐదేళ్ల ముందు ‘బాహుబలి-2’ మీద ఏకంగా రూ.50 కోట్లు పెట్టారు రాజు. అప్పుడు అది చాలా పెద్ద రిస్క్ అన్నారు. కానీ రాజు ఆ రేటు మీద మంచి లాభాలు చూశాడు. ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్లు, అదనపు ధరలు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉండటం… ‘సలార్’కు ఉన్న హైప్ దృష్ట్యా ఇదేం పెద్ద రిస్క్ కాదని రాజు భావిస్తున్నాడు. సినిమాకు టాక్ వస్తే రూ.80 కోట్ల మేర షేర్ రాబడుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 29, 2023 10:23 am
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…