ఏ సినిమా కాయినా గ్లామర్ హీరోయినే. ప్రమోషన్స్ లో కూడా హీరో ఎంత తిరిగినా అందరి చూపు హీరోయిన్ మీదే ఉంటుంది. తాజాగా ఓ రెండు సినిమాలకు సంబంధించి ఆ హీరోలకి ఒకే ఇబ్బంది ఎదురైంది. విషయంలోకెళ్తే, విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందులో విజయ్ జంటగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సామ్ అనారోగ్యానికి గురైంది. వింత వ్యాధితో ఇబ్బంది పడుతూ షూటింగ్ బ్రేక్ తీసుకుంది. ఆమె కోసం కొన్ని నెలలు ఘాట్ ఆపేసి సామ్ రికవరీ అయ్యాక మళ్ళీ ఘాట్ మొదలు పెట్టారు.
అయితే ఈ సినిమాకు సాంగ్స్ మంచి బజ్ తెచ్చాయి. ఇక విజయ్ కూడా గట్టిగా టూర్లు తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ ఈ ప్రమోషన్స్ కి సమంత స్కిప్ కొట్టేసింది. హెల్త్ కారణంగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. కాకపోతే ఒకటి రెండు రోజులు ఇంటర్వ్యూల్లో విజయ్ తో పాల్గొంది. అక్కడితో చేయి దులిపేసుకుంది. సమంత ప్రమోషన్స్ కి రాకపోవడంతో విజయ్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయాడు. తాజాగా ఓ ఫోన్ వీడియో కాల్ తో విజయ్ , సామ్ చివరి ప్రమోషన్ చేసుకున్నారు.
మరో వైపు నవీన్ పోలిశెట్టి ది కూడా ఇదే పరిస్థితి. మిస్ శెట్టి , మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కి తను హాజరు కానని ముందే టీం కి చెప్పేసిందట స్వీటీ. దీంతో సినిమా ప్రమోషన్ భాద్యత అంతా నవీన్ మీదే పడింది. విజయ్ కి కనీసం సమంత కొంతైనా సపోర్ట్ చేసింది. అనుష్క మాత్రం మొత్తానికి చేతులెత్తేసింది. అధిక బరువు కారణం చేత అనుష్క మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తుందని సమాచారం. దీంతో సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదని తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ , నవీన్ పోలిశెట్టి ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసి వారిని ప్రమోషన్స్ రప్పించలేక పడరాని పాట్లు పడుతున్నారు.
This post was last modified on August 28, 2023 11:00 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…