ఇండస్ట్రీలో కొన్ని కథలు ముందుగా వేరే హీరో దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఓ హీరోకి చేరుతుంటాయి. ఇలా లిస్టు చూస్తే చాలా సినిమాలుంటాయి. తాజాగా కార్తికేయ బెదురులంక కూడా ముందుగా మరో యంగ్ హీరో దగ్గరికి వెళ్ళిందట. అవును ఈ సినిమా దర్శకుడు క్లాక్స్ కథ రాసుకున్నాక ముందుగా నేరేషన్ ఇచ్చింది శౌర్యకేనట. రెండు మూడేళ్లు శౌర్య తో ట్రావెల్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ సెట్ అవ్వక చివరికి కార్తికేయను రీచ్ అయ్యాడట.
ఇక ఆర్ ఎక్స్ 100 తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. రిజల్ట్స్ విషయం పక్కన పెడితే తను చేసిన ప్రతీ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. అందుకే కార్తికేయ క్లాక్స్ చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫైనల్ గా సినిమా చేశాడు. తొలి రోజు మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయిన బెదురులంక 2012 మెల్లగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. సినిమాలో కామెడీ క్లిక్ అవ్వడంతో వీకెండ్ లో మంచి వసూళ్లు అందుకుంది. పైగా వరుణ్ తేజ్ గాండీవ ధారి అర్జున డిజాస్టర్ అనిపించుకోవడం కూడా ఈ సినిమాకి కొంత కలిసొచ్చింది.
రోజు రోజుకి వసూళ్లు పెంచుకుంటూ బెదురులంక 2012 హిట్ వైపు వెళ్తుంది. దీంతో ఇండస్ట్రీ నుండి కార్తికేయకి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏదేమైనా శౌర్య గొప్ప సినిమా మిస్ అయ్యాడని చెప్పలేం కానీ తను డెలివరీ చేస్తున్న డిజాస్టర్స్ తో పోలిస్తే బెదురులంక కాస్త బెటర్ మూవీ అయ్యేది. అయినా కొన్ని సినిమాలు ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే చేరుతాయి. ఈ సినిమా దానికి మరో ఉదాహరణ.
This post was last modified on August 28, 2023 10:53 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…